Religious Ter*rorism: ప్రేమను చంపేసిన మతోన్మాదం.. మనుషులను సైకోలుగా మార్చిన ఉన్మాదం!

Religious Ter*rorism
x

Religious Ter*rorism: ప్రేమను చంపేసిన మతోన్మాదం.. మనుషులను సైకోలుగా మార్చిన ఉన్మాదం!

Highlights

Religious Ter*rorism: ఎందుకీ క్రూరత్వం? ఎందుకీ మతోన్మాదం? ప్రేమను చూసి అసూయపడే ఉగ్రవాదానికి అసలైన బాధితులు అమాయకులు కాదా?

Religious Ter*rorism: ఒకవైపు మనసు నిండా ప్రేమ.. మరోవైపు గుండె నిండా ద్వేషం..! పెళ్లి తర్వాత మొదటి సంతోష క్షణాలు గడిపేందుకు కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు జమ్ముకశ్మీర్‌కు వెళ్లారు. ప్రేమతో నిండిన ఆ హనీమూన్ ట్రిప్... హృదయాన్ని హత్తుకునే జ్ఞాపకాలు కలిగించాల్సిన ఆ ప్రయాణం... కొద్ది క్షణాల్లోనే నరకంగా మారిపోయింది. క్షణాల్లో కట్టుకున్న వాడిని కళ్ల ముందే కొట్టి చంపేశారు ముష్కరులు. ఊహించని ఆ ఘటనతో పెళ్లి కూతురు కన్నీళ్లలో మునిగిపోయింది. జీవితాంతం మర్చిపోలేని గాయాలతో ఇప్పటికీ ఏడుస్తూనే ఉంది. ఇది లవ్‌ వర్సెస్ టెరరిజం..! మానవత్వాన్ని చీల్చేసే ఉగ్రవాదం కశ్మీర్‌ లోయలో ఎందుకిలా పెరుగుతోంది? ఎందుకీ క్రూరత్వం? ఎందుకీ మతోన్మాదం? ప్రేమను చూసి అసూయపడే ఉగ్రవాదానికి అసలైన బాధితులు అమాయకులు కాదా? కళ్లలో కలలు పెట్టుకుని హనీమూన్‌కు వచ్చిన ఆ భార్యా భర్తలను చూసి తరుక్కుపోని హృదయం ఉందా?

ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధాల గురించి చెప్పడానికి మాటలు కూడా రావడంలేదు. పహల్గాంకు వచ్చిన వారికి జీవితం మిగలలేదు... మిగిలింది కేవలం కన్నీటి గాథలు మాత్రమే. పదుల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకున్న ఈ ఉన్మాద ఘటనలో వృద్ధుల నుంచి చిన్నారుల వరకు విగతజీవులయ్యారు. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీష్ రంజన్ కూడా ఉన్నారు.

ఈ దాడిలో ఆయన పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ దాడి తీవ్రతను చూస్తే గుండె చెదిరిపోతుంది. ఈ దాడిలో చనిపోయిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. మరోవైపు పదుల సంఖ్యలో గాయపడినవారు ఆస్పత్రుల్లో అల్లాడిపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories