ఈ ప‌థ‌కం కింద రైతుల‌కు 25 శాతం రాయితీ..! ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే..

ఈ ప‌థ‌కం కింద రైతుల‌కు 25 శాతం రాయితీ..! ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే..
x

ఈ ప‌థ‌కం కింద రైతుల‌కు 25 శాతం రాయితీ..! ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే..

Highlights

Godown Subsidy Scheme 2021: దేశ‌ప్ర‌జ‌లు ఎవ‌రికైనా రుణ‌ప‌డి ఉన్నారంటే అది పంట పండించే రైత‌న్న‌కి, బార్డ‌ర్‌లో గ‌స్తీ కాసే సైనికుడికి మాత్ర‌మే.

Godown Subsidy Scheme 2021: దేశ‌ప్ర‌జ‌లు ఎవ‌రికైనా రుణ‌ప‌డి ఉన్నారంటే అది పంట పండించే రైత‌న్న‌కి, బార్డ‌ర్‌లో గ‌స్తీ కాసే సైనికుడికి మాత్ర‌మే. అందుకే జై జ‌వాన్ జై కిసాన్ అన్నారు. ఆరుకాలం శ్ర‌మించి పంట పండించే రైత‌న్న‌కి గిట్టు బాటు ధ‌ర ల‌భించ‌క న‌ష్టాల‌పాల‌వుతున్నాడు. వ‌ర్షానికి ధాన్యం త‌డిసి ఇటు అమ్ముకోలేక అటు నిల్వ చేసుకోలేక నానా ఇబ్బందులు ప‌డుతున్నాడు. అందుకే కేంద్ర ప్ర‌భుత్వం రైతు క‌ష్టాల‌ను గ‌మ‌నించి గోడౌన్ సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ఆహార ధాన్యాల‌ను నిల్వ చేయ‌డానికి స్టోర్ హౌస్ నిర్మించుకోవ‌చ్చు. ఒక్క‌సారి ఈ ప‌థకం గురించి తెలుసుకుందాం.

గోడౌన్ సబ్సిడీ ప‌థ‌కం కింద కేంద్రం రైతుల‌కు స‌బ్సిడీ రుణాల‌ను మంజూరు చేస్తుంది. ఈ డ‌బ్బులతో స్టోర్ హౌస్ నిర్మాణాలు చేప‌ట్టి రైతులు అందులో ధాన్యం నిల్వ చేసుకోవ‌చ్చు. ఇక పంటను తక్కువ ధరకు అమ్ముకోవ‌ల‌స‌ని అవసరం ఉండ‌దు. స‌రైన ద‌ర వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే పంట‌ను అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకం కింద రైతులకు రుణాలపై 25 శాతం వరకు రాయితీ లభిస్తుంది. రైతులు ఈ స‌బ్సిడీ రుణాల‌ను ఉప‌యోగించుకొని స్టోర్ హౌస్‌ల‌ను నిర్మించుకోవాలి. త‌ద్వారా అధిక వ‌ర్షాలు, ఎండ‌ల నుంచి పండించిన పంట‌కు సేఫ్టీ దొరుకుతుంది. ఎంత కాల‌మైన ధాన్యం చెడిపోకుండా కాపాడుకోవ‌చ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి..?

రైతులు ఈ ప‌థ‌కం కింద ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే గోడౌన్ సబ్సిడీ అధికారిక వెబ్‌సైట్‌ని సంద‌ర్శించాలి. అందులో హోమ్‌పేజీని ఓపెన్ చేయాలి. Apply Now పై క్లిక్ చేయాలి. అప్పుడు దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. అందులో అవసరమైన మొత్తం సమాచారాన్ని పూరించాలి. ఇది కాకుండా కొన్ని ముఖ్యమైన పత్రాలను జతచేయాలి. అవ‌స‌ర‌మైతే స‌ద‌రు అధికారుల‌తో మాట్లాడ‌వ‌ల‌సి కూడా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories