ఢిల్లీలో బీజేపీకి 48 సీట్లు వస్తాయి: మనోజ్ తివారి

ఢిల్లీలో బీజేపీకి 48 సీట్లు వస్తాయి: మనోజ్ తివారి
x
Highlights

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. గతంకంటే ఈసారి పోలింగ్ శాతం తక్కువగా నమోదయింది. ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ (ఆప్), భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ల మధ్యే ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. గతంకంటే ఈసారి పోలింగ్ శాతం తక్కువగా నమోదయింది. ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ (ఆప్), భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ల మధ్యే ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అయితే ఎవరికీ వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తుందని అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్ విఫలమవుతాయని ఢిల్లీ బిజెపి చీఫ్ మనోజ్ తివారీతో సహా సీనియర్ భారతీయ జనతా పార్టీ నేతలు శనివారం పేర్కొన్నారు.

ఫిబ్రవరి 11 న ఓట్లు లెక్కించినప్పుడు చీపురు (ఆప్ యొక్క చిహ్నం) ఫిబ్రవరి 11 న ఢిల్లీలో తుడిచి పెట్టుకుపోతుందని మనోజ్ తివారి ఎద్దేవా చేశారు. 70 సీట్లలో 67 స్థానాలను కైవసం చేసుకున్న ఆప్ ఆప్ 2015 ఘన విజయం సాధిస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే అది నిజమైంది.. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ ను నమ్మవద్దని.. బిజెపి 48 సీట్లు గెలుచుకుని రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు తివారీ.

బిజెపి ఎంపి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఎగ్జిట్ పోల్స్ పై మాట్లాడుతూ.. బిజెపి 50 సీట్లు గెలుచుకుంటుందని, అలాగే 16 సీట్లు ఆప్‌కు, నాలుగు సీట్లు కాంగ్రెస్‌కు లభిస్తాయని పేర్కొన్నారు.ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోలింగ్ ముగింపు అనంతరం ఢిల్లీ ఎంపీలు, ఇతర పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించి పార్టీ పనితీరును బూత్ స్థాయిలో విశ్లేషించి అభిప్రాయాన్ని సేకరించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. గతంలో విస్తృత ఎన్నికల ప్రచారంలో బీజేపీ 45 కి పైగా సీట్లను గెలుచుకుంటుందని షా మరియు నడ్డా పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఢిల్లీ ముక్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన కార్యకర్తలతో మాట్లాడుతూ.. మరోసారి ఢిల్లీ ప్రజలు ఆప్ కు పట్టం కట్టబోతున్నారని అన్నారు.. ఎన్ని రాజకీయాలు చేసినా ఢిల్లీ ప్రజలు ఆప్ పనితీరును గుర్తించారని అభిప్రాయపడ్డారు. ఇటు ఎన్నికలను వర్గీకరించడానికి బీజేపీ ప్రయత్నించినప్పటికీ ప్రజలు ఆప్ చేసిన పని ఆధారంగా ఓటు వేశారు. బిజెపి కార్యకర్తలు మత రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఇది గమనించి ఢిల్లీ ప్రజలు తమ తీర్పు ఇచ్చారని భావిస్తున్నాను. ఫలితాలు 2015 కంటే మెరుగ్గా ఉంటాయని నాకు నమ్మకం ఉంది అని ఆప్ రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్ పేర్కొన్నారు.

ఇదిలావుంటే ఎగ్జిట్ పోల్స్ ఆప్ కు అనుకూలంగా ఉండంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు నైరాశ్యంలో మునిగిపోయారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఆ పార్టీకి ఈసారి డిపాజిట్ లు కూడా దక్కే అవకాశం కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో కూడా కాంగ్రెస్ కు మరి రెండు, మూడు సీట్లే వస్తాయని కొన్ని సర్వేలు తేల్చాయి.. అలాగే కొన్ని సర్వేలు అయితే సున్నాకే పరిమితం చేశాయి. మరి ఎవరి భవిషత్ ఏంటో ఈనెల 11 న తేలిపోనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories