Manmohan Singh: విందుకు మన్మోహన్ సింగ్ దూరం

Manmohan Singh: విందుకు  మన్మోహన్ సింగ్ దూరం
x
Manmohan Singh File Photo
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం విందు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విందుకు మాజీ ప్రధాని...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం విందు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విందుకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హాజరు కావడం లేదు. ఆహ్వానం అందుకున్న మన్మోహన్ సింగ్ విందుకు రాలేకపోతున్నానని రాష్ట్రపతి కార్యాలయానికి విచారం వ్యక్తం చేస్తూ సమాచారం అందించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాకు ఆహ్వానం అందలేదని తాము ఈ విందులో ఎలా పాల్గొంటామని ఆజాద్‌ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి విందుకు తాము హాజరు కావడం లేదని కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు.

రామ్ నాథ్ కోవింద్ ఇవ్వనున్న విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గోనున్నారు. ప్రధాని నరేంద్రమోడీతోపాటు కేవలం 95మంది వీవీఐపీలు మాత్రమే పాల్గొనే ఈ విందులో కేవలం 8మంది ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానం అందింది. అసోం, హర్యానా, కర్నాటక, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ కలిపి మొత్తం 8మంది ముఖ్యమంత్రులకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానాలు అందాయి. ప్రధాని మోడీతోపాటు అతికొద్దిమంది కేంద్ర మంత్రులకు మాత్రమే ఆహ్వానమున్న అరుదైన ఈవెంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలుపంచుకోనున్నారు.

డొనాల్డ్‌ ట్రంప్ సోమవారం భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. రెండు రోజులు పర్యటనలో భాగంగా ఆయన అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించుకొని, ఆ తర్వాత మోతారా స్టేడియంలో ప్రసంగించారు. భారత్ తో తమ మైత్రి కొనసాగతుందని తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అమెరికా, భారత్‌ మూడు బిలియన్‌ అమెరికా డాలర్ల రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంటామని వెల్లడించారు. అత్యాధునికమైన ఆయుధాలు., విమానాలు కొనుగోలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నామని తెలిపారు. మోదీ వేగవంతమైన సంస్కరణలతోపాటు, వాణిజ్యంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. వ్యోమగాముల శిక్షణ, అంతరిక్ష రంగంలోనూ కలిసి పనిచేస్తామని తెలిపారు. ‎ఆ తర్వాత తాజ్ మహల్ ను కుటుంబసమేతంగా ట్రంప్ సందర్శించారు.

కాగా.. ఇవాళ షెడ్యూల్ ప్రకారం ఈరోజు 10గంటలకు ట్రంప్ దంపతులు రాష్ట్రపతి భవన్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత 10-30కి రాజ్‌ఘాట్‌‌కు చేరుకోనున్న ట్రంప్‌-మెలానియా దంపతులు.... ప్రధాని మోడీతో కలిసి మహాత్మాగాంధీ సమాధి దగ్గర నివాళులర్పిస్తారు. అనంతరం, సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాసిన తర్వాత ట్రంప్.. హైదరాబాద్ హౌజ్‌కు బయల్దేరుతారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మోడీ, ట్రంప్ మధ్య అత్యున్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశం జరుగుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories