లాక్ డౌన్ పాటించి ఇంట్లో ఉండమని చెప్పినందుకు వ్యక్తిపై కాల్పులు

లాక్ డౌన్ పాటించి ఇంట్లో ఉండమని చెప్పినందుకు వ్యక్తిపై కాల్పులు
x
Highlights

లాక్ డౌన్ నేపథ్యంలో.. ఇంట్లో ఉండమని చెప్పినందుకు ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ముజాఫర్ నగర్ లోని...

లాక్ డౌన్ నేపథ్యంలో.. ఇంట్లో ఉండమని చెప్పినందుకు ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ముజాఫర్ నగర్ లోని కక్రోలి గ్రామానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి బహిరంగ ప్రదేశంలో తిరుగుతున్న వ్యక్తులను ఇళ్లలోనే ఉండి లాక్డౌన్ ఆంక్షలకు కట్టుబడి ఉండమని కోరారు.. దాంతో అతని మాటలు పట్టించుకోకుండా అతనిపైనే కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

గాయపడిన వ్యక్తిని జావేద్‌గా గుర్తించారు, గురువారం దాడి తరువాత చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. పరారీలో ఉన్న ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ విజయ్ బహదూర్ సింగ్ తెలిపారు. జావేద్ మరియు అతని సోదరుడు దిల్షాద్ ఒక సమూహాన్ని తమ ఇళ్లలోకి వెళ్లి లాక్డౌన్ ఆంక్షలను పాటించాలని కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories