అంధ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి అఘాయిత్యం!

అంధ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి అఘాయిత్యం!
x
Representational Image
Highlights

మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. దృష్టిలోపం ఉన్న మహిళపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. దృష్టిలోపం ఉన్న మహిళపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన భోపాల్ జిల్లాలో చోటుచేసుకుంది. 53 ఏళ్ల దృష్టి లోపం ఉన్న మహిళను శుక్రవారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. కోవిడ్ -19 లాక్డౌన్ కారణంగా భర్త రాజస్థాన్ రాష్ట్రంలో చిక్కుకుపోవడంతో ఆమె ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటోంది.

దీంతో గుర్తుతెలియని వ్యక్తి ఆమె ఇంట్లోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడ్డాడు అని షాహపురా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్ర భన్ పటేల్ తెలిపారు. ఆ వ్యక్తిపై భారత శిక్షాస్మృతి లోని సెక్షన్ 376 , అలాగే ఇతర సంబంధిత సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం వేట కొనసాగుతోంది అని పోలీసులు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్ష కోసం పంపినట్లు తెలిపారు. ఇదిలాఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 1310 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 69 మంది కోలుకున్నారు. 69 మరణాలు సంభవించాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories