కోమాలో ఉన్న పేషెంట్ బయటికి నడిచొచ్చారు.. కట్ చేస్తే అదో పెద్ద స్కామ్

Man in coma walks out of ICU: రత్లాంలోని దీన్ దయాల్ నగర్‌కు చెందిన బంటికి ఒక గొడవ కారణంగా గాయపడి స్పృహ కోల్పోయారు.

Pavan Reddy
Updated on: 8 March 2025 2:31 PM IST
man in coma walks out of ICU exposed private hospital scam in Ratlam of Madhya Pradesh
X

Viral Video: కోమాలో ఉన్న పేషెంట్ బయటికి నడిచొచ్చారు.. కట్ చేస్తే అదో పెద్ద స్కామ్

Man said to be in coma walks out of ICU: ఐసీయూలో కోమాలో ఉన్న పేషెంట్ ఆరోగ్యంగా నడిచొచ్చారు.. కట్ చేస్తే అదో పెద్ద స్కామ్. ఔను మీరు చదివింది నిజమే. మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. హాస్పిటల్ ఐసీయులోంచి ఆరోగ్యంగా నడుచుకుంటూ బయటికొచ్చిన బంటి నినమా అనే వ్యక్తిని చూసి బయట ఉన్న బంధువులు, కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ వ్యక్తి కోమాలో ఉన్నారని, ఆయనకు చికిత్స అందిస్తున్నామని చెప్పి వారి వద్ద నుండి బలవంతంగా రూ. 1 లక్ష వసూలు చేసేందుకు కుట్ర చేశారు.

అంతకంటే ముందు ఏం జరిగిందంటే... రత్లాంలోని దీన్ దయాల్ నగర్‌కు చెందిన బంటికి ఒక గొడవ కారణంగా గాయపడి స్పృహ కోల్పోయారు. కుటుంబసభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తీసుకొచ్చారు. బంటి వెన్నెముక విరిగి తీవ్ర గాయమైందని, అందుకే ఆయన కోమాలోకి వెళ్లారని డాక్టర్లు తెలిపారు. వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని అన్నారు. డాక్టర్లు చెప్పిన మాట విని భయపడిన బంటి భార్య, కుటుంబసభ్యులు బంధుమిత్రుల దగ్గర అప్పు చేసి ఆ మొత్తం పోగేసుకున్నారు. అంతలోనే బంటి అసలు తనకేమీ కానట్లుగా తనంతట తనే ఆరోగ్యంగా బయటికి పరుగెత్తుకొచ్చారు. బంటి నడుచుకుంటూ రావడం చూసి అందరూ షాక్ అయ్యారు.

బంటి చెప్పింది విని మరింత షాక్

బంటి తనకేమీ కాలేదని, తను ఆరోగ్యంగాగానే ఉన్నానని అన్నారు. ఐసీయూలో ఐదుగురు సిబ్బంది తనని అదిమిపెట్టి లోపలే బంధించినట్లు చెప్పారు. వారు లేని సమయం చూసుకుని తప్పించుకుని బయటికొచ్చినట్లు చెప్పారు. బంటి చెప్పిన విషయం విన్నాకే ఆస్పత్రి చేసిన మోసం ఏంటో బయటున్న వారికి అర్థమైంది. కోమా పేరుతో అవసరం లేని చికిత్స చేస్తూ తమ వద్ద డబ్బు గుంజేందుకు కుట్ర చేశారని బంటి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అప్పటికే డాక్టర్లు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌లో ఉన్నవన్నీ తీసుకొచ్చి ఇచ్చినట్లు చెప్పారు.

Pavan Reddy

Pavan Reddy

Next Story