ప్రేమించిన వ్యక్తితో భార్యకు వివాహం చేయనున్న భర్త !

ప్రేమించిన వ్యక్తితో భార్యకు వివాహం చేయనున్న భర్త !
x
భార్యకు కన్యాదానం చేయనున్న భర్త
Highlights

ఓ వ్యక్తి మాత్రం తన భార్య మరో వ్యక్తిని ప్రేమించిందని తెలిసి ప్రియుడితో పెళ్లి చేయాలని చూస్తున్నాడు.

కన్యాదానం చిత్రంలో హీరో శ్రీకాంత్ పెళ్లికి ముందు భార్య మరో వ్యక్తిని ప్రేమించిందని తెలుసుకుని ఆమె సంతోషం కోసం ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. తన భార్య పరాయి మగవాడితో మాట్లాడితేనే చాలా మంది భర్తలు అనుమానిస్తారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం తన భార్య మరో వ్యక్తిని ప్రేమించిందని తెలిసి ప్రియుడితో పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అయితే ఇవన్ని సినిమాల్లో మాత్రమే జరుగుతాయి. నిజజీవితంలో అచ్చు ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది.

భోపాల్‌కు చెందిన మహేశ్‌, సంగీతకు 7 సంవత్సరాలు క్రితం పెళ్లైంది. మహేశ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. సంగీత ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి కన్నా ముందే మహేశ్ భార్య సంగీత మరో వ్యక్తిని ప్రేమించింది. అతనితో పెళ్లికి కుటుంబంలోని పెద్దలు ఒప్పుకోలేదు. సంగీతను మహేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు. కానీ, పెళ్లి తర్వాత సంగీత ప్రేమ వ్యవహరం మహేశ్‌కు తెలిసింది. తరచూ వారిద్దరు గొడవ పడుతుండేవారు.

ఈ గొడవలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని మహేశ్ ఆలోచించాడు. ఆమెక ప్రేమకు తాను అడ్డుగా ఉండకూడదని భావించాడు. సంగీత తన ప్రియుడి వద్దకు వెళ్లాలంటే చట్ట ప్రకారం విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టాడు. దీనికి భార్య సంగీత ఒప్పుకుంది. ఫ్యామిలీ కోర్టులో ఇద్దరు వీడాకులు తీసుకోనున్నారు. ఇద్దరు పిల్లల సంరక్షణ చూసుకుంటానని మహేశ్ చెప్పాడు. దీనికి సంగీత కూడా అంగీకరించింది. సంగీతకు ప్రియుడితో మహేశ్ వివాహం చేయనున్నాడు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories