పుట్టిన బిడ్డ మృతిచెందిందని గుంత తవ్వితే .. ప్రాణాలతో మరో పాప బయటకు...

పుట్టిన బిడ్డ మృతిచెందిందని గుంత తవ్వితే .. ప్రాణాలతో మరో పాప బయటకు...
x
Highlights

మట్టికుండలో నుంచి పిల్లలు పుట్టడం పురాణాల్లోనే అని విన్నాం. కానీ నిజ జీవితంలో కూడా ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. కూతురు పుట్టిన ఆనందం క్షణామైనా వారికి లేదు పాప పుట్టగానే మరణించింది.

కూతురు పుట్టిన ఆనందం క్షణామైనా వారికి లేదు పాప పుట్టగానే మరణించింది. నెలలు నిండకుండానే పాప జన్మించడంతో ఆ పాప మరణించింది. పసికందు మృతదేహం కణణం చేయడానికి వెళ్లిన తండ్రికి మరో పాప లభించింది. దీంతో ఆశ్చర్యపోయాడు. బతికి ఉండగానే పసికందును పూడ్చారు మరో తల్లిదండ్రులు. విధి ఆడిన నాటనంలో ఓ పాప ప్రాణం పోతే మరో పాప పునజన్మ లభించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

రాయ్‌బరేలీలోని ఎస్సై వైశాలి, భర్త హితేశ్ కుమార్ దంపతులు నివసింస్తున్నారు. అయితే గత బుధవారం వైశాలికి ఏడు నెలలకే పురిటి నొప్పులు రావడంతో ఓ ప్రైవేటు దవాఖానాలో చేర్చారు. గురువారం ఆమె ఓ పాపకు జన్మించింది. కానీ పుట్టిన కాసేపటికే ఆ పసికందు ప్రాణాలు విడిచింది. దీంతో పసికందు మృతదేహాన్నిపూడ్చేందుకు శ్మశానినికి వెళ్లి సిరోహి గోయ్యి తీశాడు. మూడు అడుగుల లోతులో గోయ్యి తీయ్యగానే ఓ మట్టి కుండ అతనికి తగిలింది. ఆ కుండను తీసి చూడగా దాంట్లో ఓ మరో పాప ఉంది. దీంతో కాస్తా ఆశ్చర్యానికి గురైనా సిరోహి తర్వాత తేరుకుని చూశాడు. ఆ పాప శ్వాస కష్టంగా తీసుకోవడం గ్రహంచి చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ‌్లాడు.

అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాప తల్లిదండ్రులు ఎవరో గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. చిన్నారి చికిత్స ఖర్చు భరించేందుకు స్థానిక ఎమ్మెల్యే విశ్రా ముందుకువచ్చారు. ఆ పాప ఆరోగ్యంగా ఉందని సీఎంవో కార్యాలయ అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories