లాక్‌డౌన్‌ : భార్య పుట్టింటి నుంచి రాలేద‌ని భర్త ఆత్మహత్య

లాక్‌డౌన్‌ : భార్య పుట్టింటి నుంచి రాలేద‌ని భర్త ఆత్మహత్య
x
Highlights

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.అయితే ఈ లాక్ డౌన్ ఓ వ్యక్తికి శాపంగా మారింది. లాక్ డౌన్ నేపథ్యంలో భార్యతో ఎడబాటు భరించలేక ఆ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గోండాలోని రాధా కుంద్ ప్రాంతానికి చెందిన రాకేశ్ సోని(32)కి నాలుగేళ్లకిందట వివాహం అయింది. అయితే అత‌ని భార్య లాక్‌డౌన్‌కు ముందు ఆమె పుట్టింటికి వెళ్లింది. ఈలోపు భారత ప్రభుత్వం లాక్ డౌన్ ను ప్రకటించింది.

దాంతో ఎక్కడికెక్కడ బస్సులు, రైళ్లు అలాగే ఇతర వాహనాలు అలాగే నిలిచిపోయాయి. ఈ క్రమంలో రాకేశ్ సోని భార్య తల్లిగారి ఇంటివద్దే ఉండిపోయింది. అయితే త‌న చెంత‌న భార్య లేక‌పోవ‌డం రాకేశ్ త‌ట్టుకోలేక‌పోయాడు. దాంతో ఒంటరి తనంగా భావించాడు.. ఆమె లేకుండా జీవించ‌డం త‌న వ‌ల్ల కాద‌ని భావిస్తూ.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని చ‌నిపోయాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories