యువకుడి అసభ్య చర్య.. యువ‌తిపై ఉమ్మివేసి..

యువకుడి అసభ్య చర్య.. యువ‌తిపై ఉమ్మివేసి..
x
Highlights

పది రోజుల క్రితం ముంబైలోని మ‌ణిపురి లో ఓ మహిళపై ఉమ్మి వేసిన కేసులో 29 ఏళ్ల వ్యక్తిని సబర్బన్ వకోలా పోలీసులు అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు....

పది రోజుల క్రితం ముంబైలోని మ‌ణిపురి లో ఓ మహిళపై ఉమ్మి వేసిన కేసులో 29 ఏళ్ల వ్యక్తిని సబర్బన్ వకోలా పోలీసులు అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. నిందితుడిని కుర్లా (వెస్ట్) నివాసి అమీర్ ఖాన్ గా గుర్తించారు. ముంబైలో మ‌ణిపురికి చెందిన యువ‌తి ఏప్రిల్ 6న‌ నిత్యావ‌స‌రాలు తెచ్చుకునేందుకు గీతా విహార్ జంక్ష‌న్ నుంచి క‌లీనా మిల‌ట‌రీ క్యాంప్ వైపుగా వెళ్లింది. స‌రిగ్గా ఇదే స‌మయంలో ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళుతున్న ఓ యుకుడు సడన్ గా ఆమె దగ్గరకు వెళ్ళాడు. అనంత‌రం ఆమె దుస్తుల‌పై ఉమ్మివేసి అక్క‌డ నుంచి ప‌రార‌య్యాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు.

సిసిటివి ఫుటేజ్ సహాయంతో అతని మోటారుబైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ను పోలీసులు గుర్తించారు. అత‌డు ప‌శ్చిమ‌ ముంబైలోని కుర్లాలో నివ‌సించే అమిర్‌ఖాన్‌గా గుర్తించారు. అంతేకాదు అతనొక సేల్స్ మ్యాన్ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 8) మంజునాథ్ సింఘే అన్నారు. అతనిపై "ఐపిసి సెక్షన్ 270 అలాగే ఐపిసి 352 కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసినట్టు డీసీపీ మంజునాథ్ సింఘే తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories