మోడీకి దీదీ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి?

మోడీకి దీదీ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి?
x
Highlights

ప్రధాని మోడీతో చర్చలు ఫలప్రదమయ్యాయంటున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానిని తొలిసారి కలిసిన మమత ఆయనకు...

ప్రధాని మోడీతో చర్చలు ఫలప్రదమయ్యాయంటున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానిని తొలిసారి కలిసిన మమత ఆయనకు కానుకగా కుర్తాను, బెంగాలీస్వీట్స్ ను అందించారు. రాష్ట్రాభివృద్ధికి 12 వేల కోట్లు నిధులు అవసరమవుతాయని, వాటిని సమకూర్చమని కోరినట్లు మమత తెలిపారు. అలాగే బెంగాల్ పేరును బంగ్లాగా మార్చే అంశం కూడా భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. త్వరలోనే అమిత్ షాతో కూడా భేటీ అయ్యేందుకు మమత ఆసక్తి చూపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న వీరిద్దరూ ఇప్పుడు కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. జాతీయ పౌర రిజిస్టర్ లాంటి వివాదాస్పద అంశాలేవీ మమత తన చర్చల్లో ప్రస్తావించలేదని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories