చీప్‌ పబ్లిసిటీ కోసమే.. భారత్ బంద్ పై మమతా బెనర్జీల సంచలన వ్యాఖ్యలు

చీప్‌ పబ్లిసిటీ కోసమే.. భారత్ బంద్ పై మమతా బెనర్జీల సంచలన వ్యాఖ్యలు
x
Highlights

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం 10 కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం 10 కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పలు చోట్ల బుధవారం ఉదయం నుంచే బంధ్ కొనసాగుంది. ఈ క్రమంలో తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వామపక్ష పార్టీలపై విమర్శలు వర్షం కురిపించారు. రాస్తారొకోలు, ధర్నాలుతో వామపక్స పార్టీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తే చూస్తు ఉరుకునేది లేదని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ చట్టం, కేంద్ర ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే శాంతియుత ఆందోళనలకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.

అయితే పశ్ఛిమ బెంగాల్లో మాత్రం అనిశ్చితి పెంచేందుకు వామపక్షాలు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో ఇతర కారణాలలో ధర్నాలకు దిగుతున్నాయని మండిపడ్డారు. రాజకీయంగా ఉనికి లేని పార్టీలు పోరాటలు ఎన్నుకున్నాయని విమర్శించారు. రాజకీయంగా ఉనికి నిలుపుకోవడానికే వామపక్షాలు ఇతర పార్టీలు ధర్నాల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. లెప్ట్ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చిన ప్రభుత్వ బస్సులపై బాంబులు వేసి చీప్‌ పబ్లిసిటీ కోసం చూస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలు సిగ్గుమలినివి అని అన్నారు. వాటి బదులు రాజకీయ సమాధి కావడం ఉత్తమని సూచించారు.

సీపీఎంకు ఎటువంటి విధానాలు లేవని రైల్వే ట్రాక్‌లు, బస్సులపై బాంబులను విసరడం, ప్రయాణికులపై దాడులు చేయడం నిదర్శనం అని మండిపడ్డారు. ఈ చర్యలను ఖండిస్తున్నామని తెలిపారు. అయితే బంద్ కు తమ మద్దతు ఉంటుంది. దాని వెనక జరిగే హింసాత్మక చర్యలకు కాదని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఆందోళనల్లో కనిపించని లెఫ్ట్ పార్టీలు బెంగాల్ అల్లర్లు చేయడంపై విమర్శించారు.

కాగా, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, ప్రొఫెసర్లపై జరిగిన దాడికి నిరసనగా, బెంగాలోని కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ విశ్యవిద్యాలయం విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థులపై పోలీసులు లాఠిచార్జి చేశారు. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలపై మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వామపక్ష పారీలు అన్ని భారత్‌ బంద్‌కు పిలుపునివ్వడంపై విమర్శించారు. చీప్‌ పబ్లిసిటీ కోసమే బంద్ చేపట్టాయని మండిపడ్డారు. మరో వైపు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా బంద్ కొనసాగుతుంది. విజయవాడలో వామపక్షల ఆధ్వర్యంలో ర్యాలీలు చెపట్టారు. జాతీయ రహదారిపై వామపక్ష పార్టీల నేతలు ఆందోళనకు దిగారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories