మీ సమస్యలను పరిష్కరిస్తాం .. విధుల్లోకి వెళ్ళండి .. మమతా బెనర్జీ

మీ సమస్యలను పరిష్కరిస్తాం .. విధుల్లోకి వెళ్ళండి .. మమతా బెనర్జీ
x
Highlights

పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే .. అయితే ఈ ఆందోళన పీక్ స్టేజీకి వెళ్ళడంతో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ...

పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే .. అయితే ఈ ఆందోళన పీక్ స్టేజీకి వెళ్ళడంతో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ దిగొచ్చారు. వైద్యుల డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధమని స్పష్టంచేశారు. వైద్యులు చెప్తున్న డిమాండ్లన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. అయితే వైద్యులు విధుల్లో చేరాలని కోరారు. విధుల్లో చేరితే జూనియర్ డాక్టర్లు కోరుతున్న దానికంటే ఎక్కువ తీరుస్తామని తేల్చిచెప్పారు.రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే విధుల్లో చేరాలని కోరారు. వైద్యుల న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories