Top
logo

చాయ్ వాలా అవతారమెత్తిన మమతా బెనర్జీ

చాయ్ వాలా అవతారమెత్తిన మమతా బెనర్జీ
Highlights

దీదీ చాయ్‌వాలీగా అవతారమెత్తారు. పైకి గంభీరంగా ఉన్నా లోపల మంచి మనసున్న నేతల్లో మమతా బెనర్జీ ఒకరని అంటుంటారు ఆమె అభిమానులు. అందుకు తగ్గట్టుగానే అప్పుడప్పుడూ ఆమె తన అభిమానుల కోసం ఏదో ఒకటి చేస్తుంటారు.

దీదీ చాయ్‌వాలీగా అవతారమెత్తారు. పైకి గంభీరంగా ఉన్నా లోపల మంచి మనసున్న నేతల్లో మమతా బెనర్జీ ఒకరని అంటుంటారు ఆమె అభిమానులు. అందుకు తగ్గట్టుగానే అప్పుడప్పుడూ ఆమె తన అభిమానుల కోసం ఏదో ఒకటి చేస్తుంటారు. తాజాగా ఈ బెంగాల్ సీఎం స్థానికుల కోసం స్వయంగా టీ పెట్టారు. బెంగాల్ దిఘాలోని దత్తపూర్‌లోని ఓ టీస్టాల్‌లో తనే స్వయంగా టీ కాచి గ్లాసుల్లో పోసి అందరికీ సెర్వ్ చేశారు. దీదీ అభిమానానాకి వాళ్లంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

రాజకీయాలతో బిబీబిజీగా పర్యటిస్తున్న టైంలో కాసేపు బ్రేక్‌ తీసుకున్నారు. ఓ చాయ్‌ షాపు దగ్గర కాసేపు సరదాగా గడిపారు. అక్కడ ఓ చిన్న పాపను ఎత్తుకుని ముద్దాడారు. మమత అక్కడ ఉన్నారనే వార్త తెలుసుకుని భారీ సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. దీంతో అక్కడున్న వారితో కాసేపు మాట్లాడటం వైరల్‌గా మారింది. చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఆనందమయం చేస్తాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
లైవ్ టీవి


Share it
Top