Mallikarjun Kharge: CWC సమావేశాల్లో ఖర్గే హాట్‌ కామెంట్స్‌

Mallikarjun Kharge Hot Comments in CWC Meetings
x

Mallikarjun Kharge: CWC సమావేశాల్లో ఖర్గే హాట్‌ కామెంట్స్‌

Highlights

Mallikarjun Kharge: వచ్చే రెండు, మూడు నెలల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి

Mallikarjun Kharge: హైదరాబాద్ వేదికగా రెండోరోజు CWC సమావేశాలు కొనసాగుతున్నాయి. తాజ్ కృష్ణలోని భారత్ జోడో హాల్ లో CWC విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. అయితే.. CWC సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాట్‌ కామెంట్స్‌ చేశారు. వచ్చే రెండు, మూడు నెలల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని, అలాగే.. లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉందని నేతలకు గుర్తుచేశారు. ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదన్నారు.

వ్యక్తిగత ఆసక్తులను పక్కనపెట్టి అవిశ్రాంతంగా పనిచేయాలని నేతలకు సూచించారు. వ్యక్తిగత విభేదాలకు వెళ్లకుండా పార్టీ విజయానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పార్టీకి లేదా నాయకులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయరాదని హెచ్చరించారు. ఐక్యత, క్రమశిక్షణతో శత్రువులను ఓడించగలమన్న ఖర్గే.. కర్ణాటకలో ఐక్యత, క్రమశిక్షణతోనే విజయం సాధించామని చెప్పారు. గత పదేళ్లలో బీజేపీ పాలనలో సామన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. 2024లో బీజేపీని అధికారం నుంచి గద్దె దించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు ఖర్గే.

Show Full Article
Print Article
Next Story
More Stories