West Bengal: బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తున్న మాల్దా ఘటన.. టీఎంసీ నేతలే అంటూ బీజేపీ ఆరోపణలు

Malda Incident Shaking Bengal Politics
x

West Bengal: బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తున్న మాల్దా ఘటన.. టీఎంసీ నేతలే అంటూ బీజేపీ ఆరోపణలు

Highlights

West Bengal: ఇవాళ మాల్దా ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగిన బీజేపీ

West Bengal: పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను మాల్దా ఘటన కుదిపేస్తోంది. దొంగతనం చేశారంటూ ఇద్దరు మహిళలను కొట్టి.. వివస్త్రలను చేసిన ఘటన ఈనెల 19న చోటుచేసుకుంది. నిన్న ఇందుకు సంంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ నేతలు అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. నిందితులంతా TMC నేతలే అంటూ ఆరోపిస్తున్నారు బెంగాల్ బీజేపీ నేతలు. మాల్దా ఎస్పీ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. ఎస్పీని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలో కూడా బీజేపీ ఎమ్మెల్యేలు మాల్దా ఘటనపై ఆందోళనకు దిగారు. ఇక ఈ కేసును సుమోటోగా తీసుకున్న పోలీసులు.. ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories