Jammu And Kashmir: సరిహద్దుల్లో అలజడి.. ఉగ్రవాదుల భారీ చొరబాటు కుట్ర భగ్నం

Major Infiltration Bid Foiled Along International Border In Jammu And Kashmir
x

Jammu And Kashmir: సరిహద్దుల్లో అలజడి.. ఉగ్రవాదుల భారీ చొరబాటు కుట్ర భగ్నం

Highlights

Jammu And Kashmir: ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న భద్రతా బలగాల కూంబింగ్‌

Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. గత గురువారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు భారత ఆర్మీ జవాన్లు మరణించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. రాజౌరి, ఫూంచ్ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను సైన్యం నిలిపివేసింది. అయితే ఫూంచ్ దాడికి తామే బాధ్యులమంటూ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ప్రకటించింది. PAFF అనేది జమ్ముకశ్మీర్‌లో మిలిటెంట్‌ దాడిలో నిమగ్నమైన ‎ఒక తీవ్రవాద సంస్థ.

ఈ బృందం పౌరులను, ప్రభుత్వం అధికారులను చంపడం, భారత భద్రతా దళాలపై దాడి చేయడం, రిక్రూట్‌మెంట్ కోసం యువతను ఆకర్షించడం టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత ఆర్మీ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. మెరుపుదాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు స్నిఫర్ డాగ్‌లను కూడా రంగంలోకి దింపినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories