దేశీయ విమానాలకు అనుమతించని మూడు రాష్ట్రాలు ఇవే!

దేశీయ విమానాలకు అనుమతించని మూడు రాష్ట్రాలు ఇవే!
x
Highlights

కరోనా వ్యాప్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ప్రజారవాణా ఎక్కడికక్కడే స్తభించిపోయింది.

కరోనా వ్యాప్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ప్రజారవాణా ఎక్కడికక్కడే స్తభించిపోయింది. ఇక తాజాగా కేంద్రం లాక్ డౌన్ ని మే31 వరకు పొడిగిస్తూ పలు మార్గదర్శకాలను సూచించింది. అందులో భాగంగా మే 25నుంచి విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టుగా వెల్లడించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు రేపటి నుంచి విమానాలు చక్కర్లు కొట్టనున్న నేపథ్యంలో మూడు రాష్ట్రాలు మాత్రం ఇంకా తాము సిద్ధంగా లేమని, ఇప్పట్లో విమానాలు నడపడానికి విళ్లేదని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెబుతున్నాయి

అయితే ఆ మూడు రాష్ట్రాలు పెద్దవి కావడం విశేషం.. అవే తమిళనాడు, మహారాష్ట్ర, పచ్చిమ బెంగాల్.. దేశములో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయు. దీనితో ఇప్పట్లో విమానాలు నడపడానికి తాము సిద్ధం లేమని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వెల్లడించింది. ఇక మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 2,608 మందికి వైరస్ సోకింది. దీనితో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,190కి చేరింది. అటు మరణాల్లోనూ మహారాష్ట్ర టాప్‌లో ఉంది. ఇప్పటి వరకూ అక్కడ 1,577 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉంది.. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి ఈ నెల 31 వరకు విమాన సర్వీసులను చెన్నైకి నడపకూడదని తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి వెల్లడించింది. అక్కడ కరోనా కేసుల సంఖ్య పదిహేను వెలకి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 759 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అటు మరణాల సంఖ్య 103 కి చేరింది. ఇక పశ్చిమ బెంగాల్ లో మాత్రం కరోనా వ్యాప్తితో పాటు తాజాగా అక్కడ ఉంఫాన్ తుఫాన్ వచ్చి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. దీనితో తుఫాను సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నామాని, ఇప్పట్లో కోల్‌కతాకు విమానాలు వద్దని పశ్చిమబెంగాల్‌ సర్కార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories