మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం
x
Highlights

మహారాష్ట్రలో మొదలైన రిసార్ట్ రాజకీయాలు. పూర్తిగా తప్పుడు వార్తలు అంటూ ఖండిస్తున్న ఆపార్టీ ఎంపీ సంజయ్.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి 15 రోజులు గడుస్తున్న ప్రభుత్వ ఏర్పాటు ఓ కొలిక్కి రాలేదు. ఎన్నికల్లో బీజేపీ - శివసేన కూటమిగా పోటీ చేశాయి. అయితే ఫలితాల అనంతరం ఇరు పార్టీల మధ్య ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో పొత్తు కుదరలేదు. శివసేన ప్రతిపాదించిన ఫిఫ్టీ- ఫిఫ్టీ ఫార్ములాకు బీజేపీ అంగీకరించలేదు. దీంతో శివసేన వెనక్కి తగ్గింది. ఆపార్టీ ఎంపీ సంజయ్ రౌత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన ఎంపీ సంజయ్ ప్రత్యర్థిపార్టీ ఎన్సీపీ అధినేత శరద్ పవర్ ని కూడా కలిశారు. శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పలు కీలక వాఖ్యలు చేశారు. దీంతో మహారాష్ట రాజకీయాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. శుక్రవారంతో ప్రభుత్వ గడువు ముగుస్తుడడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరు ముందుకు రాకపోతే గవర్నర్ పాలన విధించే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు చేసేందుకు బీజేపీ ముందుకు వచ్చింది. గవర్నర్ ను కలిసేందుకు బీజేపీ సిద్ధమైంది. మరో వైపు శివసేన తన పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లకుండా పలు జాగ్రత్తలు పడుతోంది. ఎమ్మెల్యేలందరికి క్యాంప్ ఎర్పాటు చేసిందని, వారిని ముంబైలోని ఓ హోటల్ తరలిస్తుందని వార్తలు వచ్చాయి.

ఎమ్మెల్యే హోటల్ కు తరలించే వార్తలను శివసేన తోచిపుచ్చింది. అలాంటిదేమి లేదని ఆ పార్టీ చెప్పుకొచ్చింది. ఫిఫ్టీ- ఫ్టిఫ్టీ విషయంలో బీజేపీకి శివసేనకు మధ్య పొత్తు కుదరకపోవడంతో రెండు పార్టీల మధ్య మాటల యుధ్ధం జరుగుతోంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ శరద్ పవర్ ను కలిశారు. శరద్ పవర్ మద్దతు తీసుకోవాలని శివసేన చూసింది. దీంతో ప్రతిపక్షంలో ఉంటామని పొత్తుకు అంగీకరించేది లేదని పవర్ తెల్చిచెప్పారు.

బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేస్తామన్న నేపథ్యంలో శివసేన తమ పార్టీ ఎమ్మెల్యేలను హోటట్ తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. శివసేన ఎంపీ సంజయ్ ఈ వార్తలను ఖండించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎక్కడికి తరలించాల్సిన పని లేదని వారు అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారని తెలిపారు. బీజేపీ ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తుందని శివసేనకు చెందిన వ్యక్తి సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు ఉద్దవ్ దకరే నివాసంలో సమావేశమయ్యారు. భవిష‌్యత్ కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories