ఎన్నికల్లో రికార్డు విజయం సాధించిన బామ్మ

ఎన్నికల్లో రికార్డు విజయం సాధించిన బామ్మ
x
వీరమ్మల్ అజగప్పన్
Highlights

ఎన్నికల్లో విజయం సాధించాలంటే అంత సులభం కాదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా విజయం వరిస్తుందని నమ్మకం లేదు. ఓటర్లు ఎప్పుడు ఎవరివైపు ఉంటారో చెప్పలేం. అయితే...

ఎన్నికల్లో విజయం సాధించాలంటే అంత సులభం కాదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా విజయం వరిస్తుందని నమ్మకం లేదు. ఓటర్లు ఎప్పుడు ఎవరివైపు ఉంటారో చెప్పలేం. అయితే ఓ 79 ఏళ్ల వృద్ధురాలు ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా తన సమీప ప్రత్యార్థులను చిత్తుగా ఓడించింది. ముధురై జిల్లాలోని మెలురు తాలూకా, అరిత్తపట్టి గ్రామ వీరమ్మల్ అజగప్పన్ అనే 79 ఏళ్ల బామ్మ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ బామ్మపై పోటీకి దిగిన వారంతా చిత్తుగా ఓడిపోయారు.

వీరమ్మల్ అజగప్పన్ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల రణ క్షేత్రంలోకి దిగింది. బామ్మపై పోటీకి నిలబడిన ప్రత్యర్థులు ప్రచారంలో వయస్సు మళ్లిన వారు పోటీ చేస్తే అభివృద్ధి చేయలేరని ప్రచారం చేశారు. అందుకే తమ లాంటి వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగిసిన ఆనంతరం ఫలితాలు వెల్లడించారు. ఈ ఫలితాల్లో అజగప్పన్ పై పోటీ చేసిన ప్రత్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. అంతేకాదు మీరమ్మల్ అజగప్పన్ 190పై చిలుకు ఓట్లతో విజయం సాధించింది. దీంతో బామ్మపై పోటీ చేసిన ప్రత్యార్థులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

విజయంపై వీరమ్మల్ ను ప్రశ్నింగా.. గ్రామంలో యువకులు తనను గెలిపించారని వారందరికి ధన్యవాదాలని తెలిపింది. నాపై నమ్మకంతో ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు, సేవ చేయడమే కర్తవ్యంగా పనిచేస్తా అని తెలిపింది. ఎన్నికల్లో 79 ఏళ్ల వీరమ్మల్ గెలుపుపై ముందుగానే ఊహించామని అగ్రామ వాసులు తెలిపారు. వీరమ్మల్ నేతృత్వంలో గ్రామం అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొనడం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories