పట్వారి పెళ్లికి లాక్ డౌన్ లొల్లి.. పోలీసు కేసు!

పట్వారి పెళ్లికి లాక్ డౌన్ లొల్లి.. పోలీసు కేసు!
x
Highlights

కరోనా నిబంధనలు ఓ పెళ్లి కొడుకుని కష్టాలపాలు చేశాయి. బంధుమిత్రుల సమక్షంలో ధూం ధాంగా పెళ్లి చేసుకుందామనుకున్నాడు.

కరోనా నిబంధనలు ఓ పెళ్లి కొడుకుని కష్టాలపాలు చేశాయి. బంధుమిత్రుల సమక్షంలో ధూం ధాంగా పెళ్లి చేసుకుందామనుకున్నాడు. అంతలోనే పోలీసులు అడ్డు చెప్పారు. ఏకంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

కరోనాతో విధించిన లాక్డౌన్ వల్ల పెళ్లిల్లు, పండగలు ఇతర కార్యక్రమాలు ఏదైనా సరే తక్కువ మందితో నిర్వహించుకోవాల్సిందే. అలా కాకుండా జనాలతో ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా వెంటనే కేసు నమోదు చేసేందుకు పోలీసులు వచ్చేస్తారు. ఇలాగే మాజీ ప్రధానమంత్రి దేవగౌడ మనుమడు వివాహం కాస్త ఎక్కువ మందితో నిర్వహించినట్టు తేలడంతో వారిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనకడాటం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సైతం హైదరాబాదు నుంచి అమరావతి చేరుకునే సమయంలో ఎక్కువ మంది గుంపులు, గుంపులుగా జనాలు కలిశారంటూ లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదంటూ పలుచోట్ల పోలీసులకు పిర్యాదు చేశారు. దీని తీవ్రత అన్ని విధాలుగా తెలిసిన ఒక ప్రభుత్వ ఉద్యోగి సైతం ఇలానే జనాలతో తన పెళ్లి చేసుకోవాలని ఉత్సాహ పడటంతో చివరకు కటకటాల వెనక్కు వెళ్లాల్సి వచ్చింది.

మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌ జిల్లాలో ఓ వరుడికి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ సర్కార్ బేఖాతర్ చేశాడు. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో వివాహనికి ఎక్కువ మంది పిలవకూడదన్న నిబందనలు విధించింది ప్రభుత్వం. 24 ఏళ్ల వరుడు కను చౌహాన్‌ బేతుల్‌ జిల్లాలో పట్వారీ గ్రామ రెవెన్యూ అధికారి గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి పెళ్లి కుదరడంతో బందుమిత్రుల సమక్షంలో అలీరాజ్‌పూర్‌లో పెళ్లికి గ్రాండ్ గా ఏర్పాట్లు చేసుకున్నాడు కను చౌహాన్. తన పెళ్లికి రావాలంటూ వాట్సాప్‌, సోషల్‌ మీడియాలో ఆహ్వాన పత్రికను షేర్‌ చేశాడు. దీంతో దాదాపు 1000 మందికి పైగా జనాలు బంధుమిత్రులు పెళ్లికి హాజరయ్యారు. ప్రభుత్వ సూచించిన నిబంధలు ఏమాత్రం పాటించకుండా, కనీసం మాస్కులు కూడా ధరించలేదు. పెళ్లికి వచ్చిన వ్యక్తి ఒకరు ఆ వీడియోను తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. దీంతో వెంటనే పోలీసులు సదరు పెళ్లి కొడుకు కనుపై సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేశారు. అప్పటి వరకు సంబురంగా జరుగుతున్న పెళ్లి కాస్త.. కళ తప్పింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories