'సిఎఎ' విషయంలో కేంద్రానికి షాక్ ఇచ్చిన మధ్యప్రదేశ్ క్యాబినెట్

సిఎఎ విషయంలో కేంద్రానికి షాక్ ఇచ్చిన మధ్యప్రదేశ్ క్యాబినెట్
x
Highlights

కొత్త పౌరసత్వ చట్టం రాజ్యాంగంలోని నీతిని ఉల్లంఘిస్తోందని వాధిస్తోన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ కేబినెట్ బుధవారం...

కొత్త పౌరసత్వ చట్టం రాజ్యాంగంలోని నీతిని ఉల్లంఘిస్తోందని వాధిస్తోన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ కేబినెట్ బుధవారం సమావేశమైంది. ఈ సందర్బంగా పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా ప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదించింది, అంతేకాకుండా దీనిని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించింది.

'ఈ చట్టం మతపరమైన ప్రాతిపదికన అక్రమ వలసదారుల మధ్య తేడాను చూపుతుంది. ఇది రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగం ఆమోదించబడిన తరువాత మొదటిసారిగా, వారి మతం ప్రకారం ప్రజల మధ్య తేడాను చూపించే చట్టాన్ని తీసుకువచ్చారు. ఇది దేశం యొక్క లౌకిక స్వభావాన్ని ప్రమాదంలో పడేస్తుంది' అని క్యాబినెట్ అభిప్రాయపడింది. ఇటువంటి నిబంధనలు చట్టంలో ఎందుకు చేర్చబడ్డాయో అర్థం కావడంలేదని.. దీనివలన ప్రజలు నష్టపోతున్నారు.

ప్రజల మనస్సులలో ఒక అనుమానం ఉంది. దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. మధ్యప్రదేశ్ లో శాంతియుత నిరసనలు జరిగాయి.. ఇందులో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు భాగమయ్యారు అని పేర్కొంది. ఎన్‌పిఆర్‌లో కొత్త నిబంధనలను ఉపసంహరించుకున్న ఆ తర్వాతే జనాభా రిజిస్టర్‌ను అప్‌డేట్ చేయాలని రాష్ట్ర క్యాబినెట్.. కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్ధించింది.

కాగా రాష్ట్రంలో ఇద్దరు బిజెపి నాయకులు - అజిత్ బోరాసి, మైహార్ ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి కూడా సిఎఎకు వ్యతిరేకంగా మాట్లాడారు.. ఇది దేశాన్ని విభజించవచ్చని పేర్కొన్నారు. జనవరిలో, 80 మంది ముస్లిం నాయకులు ఈ చట్టానికి నిరసనగా పార్టీ యొక్క ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. దీనిని "విభజన" చర్యగా పేర్కొన్నారు.

ఇదిలావుంటే మధ్యప్రదేశ్ కంటే ముందు.. కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించాయి. ఛత్తీస్ఘడ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని అనుకుంటోంది. దేశవ్యాప్తంగా నిరసనలు ఎదుర్కొంటున్న ఈ చట్టాన్ని అమలు చేయబోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం సిఎఎకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించదని, అయితే మహారాష్ట్రలో ప్రతిపాదిత జాతీయ పౌరుల రిజిస్టర్‌ను అమలు చేయడానికి అనుమతించబోమని చెప్పారు. పౌరసత్వం నిరూపించడం హిందువులు మరియు ముస్లింలకు కష్టమని.. తద్వారా ఎన్‌ఆర్‌సిని రాష్ట్రంలోకి రావడాన్ని అనుమతించను అని ఠాక్రే అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories