టెన్త్‌ బోర్డు నిర్వాకం.. తీవ్ర విమర్శలు

టెన్త్‌ బోర్డు నిర్వాకం.. తీవ్ర విమర్శలు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

మధ్యప్రదేశ్‌ టెన్త్‌ బోర్డు చేసిన నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదో తరగతి సాంఘీక శాస్త్రం పరీక్షా పత్రంలో పాక్‌ ఆక్రమిత...

మధ్యప్రదేశ్‌ టెన్త్‌ బోర్డు చేసిన నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదో తరగతి సాంఘీక శాస్త్రం పరీక్షా పత్రంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను 'స్వతంత్ర కశ్మీర్‌' అని టెన్త్‌ బోర్డు పేర్కొంది. ఈ సంఘటన శనివారం పెద్ద వివాదానికి దారితీసింది.. ప్రశ్నపత్రంలో, విద్యార్థులు 'పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్' కు బదులుగా 'స్వతంత్ర కశ్మీర్‌' గుర్తించాలని కోరడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరకరమైన ప్రశ్నపై సమాచారం అందుకున్న వెంటనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రముఖుడు కమల్ నాథ్ దీనిపై విచారణకు ఆదేశించారు.

ప్రశ్నపత్రాన్ని సెట్ చేసిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కమల్ నాథ్ అన్నారు. అయితే ఈ వ్యవహారంపై బీజేపీ నేత విశ్వాస్‌ సారంగ్‌ మాట్లాడుతూ.. 'అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమే. స్వంత్రం కశ్మీర్‌ అని పేర్కొనడం ముమ్మాటికి రాజద్రోహమే. వక్రబుద్ధితోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇదిలావుండగా, మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10 వ తరగతి ప్రశ్నపత్రాన్ని సెట్ చేసి మోడరేట్ చేసిన ఇద్దరు వ్యక్తులను సస్పెండ్ చేసినట్లు ANI నివేదించింది. కాగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (pok) అంటే 1947 లో పాకిస్తాన్ ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్‌లోని ఒక భాగం.

Show Full Article
Print Article
Next Story
More Stories