మా ఎమ్మెల్యేలను ఢిల్లీకి సమీపంలో ఉన్న హోటల్‌కు తరలించారు : కాంగ్రెస్ సంచలనం

మా ఎమ్మెల్యేలను ఢిల్లీకి సమీపంలో ఉన్న హోటల్‌కు తరలించారు : కాంగ్రెస్ సంచలనం
x
Highlights

రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని బిజెపి నాయకులు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను హర్యానాలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లారని...

రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని బిజెపి నాయకులు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను హర్యానాలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లారని కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి జితు పట్వారీ ఆరోపించారు. దీంతో రాష్ట్రంలో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తమ ఎమ్మెల్యేలను బిజెపి నాయకులు బలవంతంగా నిర్బంధించారు అని పట్వారీ ఆరోపించారు.

కుట్రలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ మంత్రులు నరోత్తమ్ మిశ్రా, భూపేంద్ర సింగ్, రాంపాల్ సింగ్ వంటి సీనియర్ బిజెపి నాయకులు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను హర్యానాలోని ఒక హోటల్‌కు బలవంతంగా తీసుకెళ్లారు అని పట్వారీ వార్తా సంస్థ పిటిఐకి చెప్పినట్టు తెలుస్తోంది.

బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ మంత్రి నరోత్తం తోమర్.. ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి కాంగ్రెస్ సహా ఇతర ఎమ్మెల్యేలకు రూ .25 కోట్లు ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ మంగళవారం ఆరోపించిన కొద్దిసేపటికే మధ్యప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి జితు పట్వారీ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

'కాంగ్రెస్, బిఎస్పి, సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లే ప్రక్రియను బిజెపి ప్రారంభించింది. బిజెపి మాజీ మంత్రి భూపేంద్ర సింగ్ చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా బిఎస్పి ఎమ్మెల్యే రాంబాయిని ఢిల్లీకి తీసుకెళ్లలేదా? శివరాజ్జీ (శివరాజ్ సింగ్ చౌహాన్) ఏదో చెప్పాలనుకుంటున్నారా? ' అని దిగ్విజయ సింగ్ మంగళవారం ట్వీట్ చేశారు. 'అయితే, తాము రామ్ బాయిని పూర్తిగా నమ్ముతున్నామని ఆమె (ముఖ్యమంత్రి) కమల్ నాథ్ అభిమానురాలు ఆమె కమల్ నాథ్ కు మద్దతునిస్తూనే ఉంటుంది.' అని పేర్కొన్నారు.

అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వ్యాఖ్యలకు బదులిచ్చారు. దిగ్విజయ సింగ్ ఆరోపణలు ముఖ్యమంత్రి కమల్ నాథ్ పై ఒత్తిడి తెచ్చే వ్యూహమని పేర్కొన్నారు.

మరోవైపు శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యల అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కమల్ నాథ్, 'దిగ్విజయ సింగ్ వ్యాఖ్యలను స్వాగతించారు. అలాగే రాష్ట్రంలో బిజెపి 15 సంవత్సరాల పాలనలో జరిగిన మోసాలు త్వరలో బహిర్గతమవుతాయని బిజెపి భయపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారుస్తున్నారనే పుకార్లతో ప్రభుత్వ స్థిరత్వానికి ఎటువంటి ముప్పు లేదని సిఎం స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories