Shivraj Chouhan Expands Cabinet: కొలువుదీరిన మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ పూర్తి.. రెబెల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు

Shivraj Chouhan Expands Cabinet: కొలువుదీరిన మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ పూర్తి.. రెబెల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు
x
Highlights

Shivraj Chouhan Expands Cabinet: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ మాజీ సీఎం కమల్‌నాథ్‌ సింగ్ నేతృత్వంలోన ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, మార్చి నెలలో బీజేపీ నేత, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టారు.

MP CM Shivraj Chouhan Expands Cabinet: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ మాజీ సీఎం కమల్‌నాథ్‌ సింగ్ నేతృత్వంలోన ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, మార్చి నెలలో బీజేపీ నేత, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టారు. మంత్రిమండలి విస్తరణ అంశం గత మూడు నెలలుగా వాయిదాపడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఇవాళ మధ్యప్రదేశ్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ తన మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. భోపాల్‌లో ఈ రోజు 28 మంది మంత్రులుగా గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అందులో 20 మంది మంత్రులుగా, ఎనిమిది మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.

కమల్‌నాథ్‌తో ఏర్పడిన విభేధాలతో కాంగ్రెస్‌ పార్టీకి మార్చి 10న రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు. సింధియాతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో కమల్ నాథ్ సర్కార్ కూలి శివరాజ్ సింగ్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల తర్వాత మంత్రిమండలిలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఐదుగురికి కేబినెట్ లో స్థానం కల్పించారు .రాజ్యసభ ఎన్నికలతోపాటు, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింథియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆ పార్టీ నుంచి చేరిన వారిలో మంత్రిమండలిలో చోటుకల్పించాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో మంత్రి వర్గవిస్తరణ వాయిదాపడుతూ వస్తున్నది.

ఎట్టకేలకు నేడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారిలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభురామ్ చౌదరి, గోపాల్ భార్గవ, ఇమార్తి దేవి, ప్రధుమాన్ సింగ్ తోమర్‌తో పాటు జ్యోతిరాదిత్య సింథియా విధేయులు, ఆయన బీజేపీ ఎమ్మెల్యే అయిన యశోధర రాజె సింథియా కూడా ఉన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారిలో సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ శుభాకాంక్షలు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories