Madhya Pradesh Polls: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం.. రేపు 230 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్

Madhya Pradesh Assembly Election 2023 Voting Tomorrow
x

Madhya Pradesh Polls: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం.. రేపు 230 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ 

Highlights

Madhya Pradesh Polls: బరిలో 2,533 మంది అభ్యర్థులు

Madhya Pradesh Polls: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎంపీలో బుధవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా శుక్రవారం పోలింగ్ జరగనున్నది. 230 స్థానాల్లో 2,533 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాదాపు 5కోట్ల 6లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది. ఆయా పార్టీల కీలక నేతలను రంగంలోకి దింపి ప్రచారంతో హోరెత్తించారు. ఎన్నికలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను తీసుకెళుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories