విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? ఈ విషయాలు గమనించండి!

విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? ఈ విషయాలు గమనించండి!
x
Highlights

క‌రోనా వైర‌స్ వ్యాప్తి లాక్‌డౌన్‌ కారణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జా ర‌వాణా స్థ‌భించిపోయింది.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి లాక్‌డౌన్‌ కారణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జా ర‌వాణా స్థ‌భించిపోయింది. దీంతో చాలా మంది ఇత‌ర ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. తిరితి ప్రజార‌వాణా ప్రారంభిస్తున్నారు. కేంద్ర నిర్ధేశించిన స‌డ‌లింపుల్లో భాగంగా.. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. పౌర విమానయానశాఖ కొన్ని సూచనలతో ముసాయిదాను రూపొందిచినట్లు తెలుస్తోంది. మార్చి 25 నుంచి జాతీయ అంత‌ర్జాతీయ విమానాల స‌ర్వీసులు నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ ముగిసిన త‌ర్వాత విమానాల స‌ర్వీసుల‌ను తిరిగి ప్రారంభించాల‌ని కేంద్ర యోచిస్తుంది.

కాగా.. విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించే ముందు కొన్ని ప్రతిపాద‌న‌లు సిద్ధం చేసింది. ఈ మేరకు కమర్షియల్‌ సేవలు ప్రారంభానికి ముందే ప్రభుత్వం ముసాయిదాను రూపొందించింది. ఈ మేరకు సోమవారం జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. విమాన సర్వీసులు 15 లేదా 17 నుంచి నడిపే యోచనలో కేంద్రం ఉన్న‌ట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం లోపు అధికారిక ప్రకటన చేసే అవకాశ ఉంది.

కీల‌క సూచ‌న‌లు ఇలా ఉన్నాయి.

ప్రయాణికులు క్యాబిన్‌ లగేజ్ 20 కేజీలకు మించి ఉండ కూడదు

♦ 80 ఏళ్లు దాటిన ఏ ప్రయాణికుడినీ విమానాల్లోకి అనుమ‌తి లేదు

♦ విమాన సిబ్బంది(పైలెట్లు, క్యాబిన్‌ అటెండర్లు)ను పదే పదే మార్చకూడదు.

♦ ప్రయాణ సమయంలో ఎటువంటి ఆహారాన్ని అందించరు. నిర్దేశిత ప్రాంతంలోకి వెళ్లి అక్కడ ఉంచిన కప్పులతోనే మంచినీరు తాగాల్సి ఉంటుంది

♦ ప్రయాణికుడు తన క్వారంటైన్‌ వివరాలను తప్పనిసరి

♦ గత నెలరోజుల్లో కరోనా వ్యాధి బారిన పడ్డారా? అందుకు ఏమైనా చికిత్స తీసుకున్నారా? తదితర వివరాలను తెలియజేయాలి.

♦ అలా ఎవరైనా క్వారంటైన్‌లో ఉంటే ఎయిర్‌పోర్ట్‌లో ఉండే ఐసోలేటెడ్ సెక్యురిటీ చెకింగ్‌ యూనిట్‌ను సంప్రదించాలి.

♦ విమాన ప్రయాణికులకు ఆరోగ్య సేతు యాప్‌ తప్పనిసరి.

♦ అధీకృత ట్యాక్సీలను మాత్రమే వినియోగించి ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సి ఉంటుంది.

♦ రెండు గంటల ముందు ఎయిర్‌పోర్ట్‌కులోకి అనుమ‌తి. ముందు వచ్చే వారిని అనుమ‌తి లేదు

♦ ప్రయాణానికి గంట ముందు మాత్రమే బోర్డింగ్

♦ 20 నిమిషాల ముందే గేట్లను మూసివేత‌

♦ శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి

♦ ప్రయాణ తేదీని ఎటువంటి జరిమానా లేకుండా మార్చుకొనే వెసులుబాటు

♦ ఈ వివరాలను ఎయిర్‌లైన్స్‌ నమోదు చేసి ఉంచుతాయి

♦ ఎయిర్‌పోర్ట్‌లో భౌతిక‌ దూరం పాటించడానికి గుర్తులు పెట్టడం,

♦ లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, కుర్చీలు, ఆహార పదార్థాలు విక్రయించే స్టాళ్లు యానిటైజర్లతో శుభ్రపరచాలి.

♦ భౌతిక దూరం పాటించాల్సిన నేపథ్యంలో మధ్యలో ఉండే సీట్లలో ఏ ప్రయాణికుడు కూర్చోకూడదు. అవి ఖాళీగా ఉంటాయి.

♦ ప్రయాణికులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల తనిఖీ కూడా తప్పనిసరి కాదు. టెర్మినల్‌ గేట్‌ వద్ద జన సందోహాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories