LPG Cylinder : వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది.. కొత్త రేట్లు వివరాలు ఇవే

LPG Cylinder  : వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది.. కొత్త రేట్లు వివరాలు ఇవే
x
గ్యాస్ సిలిండర్లు ఫైల్ ఫోటో( NDTV )
Highlights

మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. ప్రతి నెలా గ్యాస్ ధరలను కంపెనీలు సమీక్షిస్తూ ఉంటాయి. డాలర్ - భారత రూపాయి మారకపు విలువ, అంతర్జాతీయ మార్కెట్ లో ఎల్పీజీ...

మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. ప్రతి నెలా గ్యాస్ ధరలను కంపెనీలు సమీక్షిస్తూ ఉంటాయి. డాలర్ - భారత రూపాయి మారకపు విలువ, అంతర్జాతీయ మార్కెట్ లో ఎల్పీజీ రేట్లు అంశాల ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. గత 6 నెలలుగా పెరుగుతూ వస్తున్న గ్యాస్ ధరలు తగ్గాయి. నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధరలు అగస్టు తర్వాత తగ్గడం మొదటి సారి కావడం గమనార్హం. గత ఆరు నెలలుగా గ్యాస్ ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు గ్యాస్ ధరలు తగ్గింపు ఉపశమనం కలిగించింది. 2019 ఆగస్టు నుంచి 2020 ఫిబ్రవరి నెలల మధ్య 6 సార్లు గ్యాస్ ధరలను సవరించగా దాదాపు 50 శాతం మేర పెరిగింది.

ముంబై, ఢిల్లీలలో సబ్సిడీ లేని 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్‌ ధర 53 రూపాయలు తగ్గింది. 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర 84.50 రూపాయలు తగ్గింది. ఇతర రాష్ట్రాలలో కూడా నాన్ సబ్సిడీ వంట గ్యాస్ ధర రూ.50 తగ్గింది. గ్యాస్ వినియోగదారులు ధరలు తగ్గినా.. పెద్దగా ఆనందపడాల్సిన అంశం కాదు. ఎందుకంటే గత 6 నెలలలో గ్యాస్ ధర పెరిగిన మొత్తంతో పోలిస్తే తగ్గింది మాత్రం చాలా తక్కువ. అందువలన గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గినా.. వినియోగదారులపై భారం మాత్రం పెద్దగా తగ్గలేదనే చెప్పాలి. ముంబైలో గ్యాస్ సిలిండర్ ఫిబ్రవరి వరకూ రూ. 829.5 చెల్లించగా.. ఇక నుంచి రూ.776.5 పే చేస్తే సరిపోతుంది. ఢిల్లీలో నాన్ సబ్సిడీ వంట గ్యాస్ ధర రూ.858.5 ఉండగా.. మార్చి ఒకటో తేదీ నుంచి రూ. 805.5 చెల్లిస్తే సరిపోతోంది.‎

ఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలు 1466 రూపాయలు నుంచి 1381.50 రూపాయలకు తగ్గాయి. ప్రతి నెలా ఒకటో తేదీన నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మారుతుంది. ఒకటో తేదీన గ్యాస్ బండ ధర పెరగే అవకాశం ఉంది. ‎ లేదా అర్థిక సంవత్సం ప్రారంభం కావడంలో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్రం ప్రతి కుటుంబానికి సబ్సిడీ కింద ఏడాదికి 12 సిలిండర్లను అందిస్తోంది. అదనంగా సిలిండర్ కావాలంటే వినియోగదారులు మార్కెట్ ధర చెల్లించాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories