
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని వేర్వేరు స్తాంతాల్లో ప్రేమ జంటలు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది....
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని వేర్వేరు స్తాంతాల్లో ప్రేమ జంటలు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. పెద్దలు కూదిర్చిన వివాహం వద్దంటూ అమ్మాయి ఉరివేసుంటే.. ఆమెలేని జీవితం వ్యర్థమంటూ యువకుడు బలవన్మరణం పాల్పడ్డాడు. ఇక మరో చోట పెద్దలు ప్రేమకు ఒప్పుకోలేదని ప్రేమికులు ఇద్దరూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని లింగారెడ్డిగూడలో లింగారెడ్డిగూడకు చెందిన కర్రె పల్లవి(19) లిగారెడ్డిగూడాకు చెందిన పోచమోళ్ల మహేందర్ (21) రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. శంషాబాద్‌లో ఓ సంస్థలో మహేందర్ పనిచేస్తున్నాడు. పల్లవి కూడా నాగర్‌గూడలో కుట్టు విషన్ పనికి వెళ్తోంది. సంవత్సరం క్రితం శంషాబాద్‌లో ఇద్దరు కలిసి తిరగడం పల్లవి తల్లిదండ్రులు గమనించారు. దీంతో ఆమెను మందలించారు. మహేందర్ కుటుంబ సభ్యులను పిలిచి మరోసారి ఇలాంటి ఘటన జరకుండా హెచ్చరించారు. అయితే 2 నెలల నుంచి పని మహేందర్ మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. సోమవారం తెల్లవారుజామున గ్రామంలోని ఓ పొలంలో చెట్టు కొమ్మకు చున్నీతో వారిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడ్డారు.
రంగారెడ్డి జిల్లాలోనే మరో దారుణం జరిగింది. కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో సుశీల (18), అదే గ్రామానికి చెందిన శీరాములు (29) ప్రేమించుకుంటున్నారు. ప్రేమికులు ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో సుశీలకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. దీంతో ఆమె తన ప్రేమ సంగతి ఇంట్లో చెప్పింది. ఇరువురివి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు వారి ప్రేమను నిరాకరించారు. పెద్దలు తమ ప్రేమకు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన యువతి గదిలోఉరి వేసుకుంది. ప్రియురాలి మరణ వార్త విని ఆమెలేని జీవితం జీవించలేనని చనిపోతానని స్నేహితుడితో ఫోల్‌లో చెప్పాడు. మిత్రుడితో మాట్లాడిన గంటకే తన పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




