పౌరసత్వ సవరణ బిల్లుకు అర్థరాత్రి లోక్‌సభ ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లుకు అర్థరాత్రి లోక్‌సభ ఆమోదం
x
Highlights

లోక్‌సభలో పౌరసత్వ (సవరణ) బిల్లుకు సోమవారం అర్థరాత్రి లోక్‌సభ ఆమోదం తెలిపింది. సుదీర్గంగా జరిగిన చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 311,...

లోక్‌సభలో పౌరసత్వ (సవరణ) బిల్లుకు సోమవారం అర్థరాత్రి లోక్‌సభ ఆమోదం తెలిపింది. సుదీర్గంగా జరిగిన చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 311, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లు తీసుకురావడం వెనుక ఎలాంటి రాజకీయ అజెండా లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. దేశంలో ఉన్న ముస్లింలకు ఎటువంటి నష్టం కలుగదని స్పష్టం చేశారు. వైసీపీ లోక్ సభా పక్షనేత ఎంపి మితున్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ "మత సామరస్యాన్ని మరియు పారదర్శక పాలనను" విశ్వసిస్తుందని అన్నారు.

అయితే, బిల్లులో ముస్లింలను మినహాయించడం గురించి తమపార్టీకి ఆందోళన ఉందని ఆయన అన్నారు. బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదిస్తే ప్రధానంగా మూడు దేశాల్లోని పాకిస్థాన్..బంగ్లాదేశ్..అఫ్ఘానిస్థాన్‌లో వివక్షకు గురై.. అక్కడి నుండి భారత్ కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఇందులో భాగంగా ఈ మూడు దేశాల నుంచి 2014 డిసెంబరు 31వ తేదీలోపు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను అక్రమ వలసదారులుగా పరిగణించరు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories