దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై పార్లమెంట్‌లో దుమారం

దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై పార్లమెంట్‌లో దుమారం
x
Highlights

దిశను దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో విచారణ జరుపుతున్నప్పుడు...

దిశను దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో విచారణ జరుపుతున్నప్పుడు పోలీసులుపై దాడి చేసి వారి నుంచి గన్ లాక్కొని పారిపోతుండగా, పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దీనిపై పార్లమెంట్‌లో ఎంపీలు సుదీర్ఘంగా చర్చనడిచింది. లోక్‌సభలో మొదటి కాంగ్రెస్ పార్టీ ఈ చర్చను లేవదీసింది. దేశంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని,ప్రభుత్వాలు రూపొందిచింన చట్టాలు అమలుకు నోచుకోవడంలేదని అదీర్‌ రంజన్‌ చౌదరి సభలో ప్రసంగించారు. అనంతరం షాద్‌నగర్‌ ఘటనపై రేపిస్టులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు విపక్షాలన్ని దిశ హత్యకేసులో నిందితునలు ఎన్ కౌంటర్ చేయడంపై మద్దతు తెలిపారు.

ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార ఘటనఫై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాయ్‌బరేలీ కోర్టులో విచారణకు వెళ్తున్న బాధితురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటనపై ప్రతిపక్షలు ఆందోళన వ్యక్తం చేశాయి. మహిళలకు దేశంలో రక్షణ లేకుండా పోయిందని, ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఎలా జీవిస్తారని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఉన్నావ్‌ అత్యాచార ఘటన నిందితులకు ‎ఎన్ కౌంటర్ చేయాలి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు రాజ్యసభలో కూడా విపక్షలు పెద్ద ఎత్తున ఆందోళ వ్యక్తం చేశాయి. నిర్భయ అత్యాచార నిందితులను ఉరి శిక్ష ఎందుకు అమలు చేయలేదని ఆప్ ప్రశ్నించింది. అయితే దీనిపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఇలాంటి ఘటనలను రాజకీయం చేయడం సరికాదన్నారు. ఉ‍న్నావ్‌ , తెలంగాణలో ఈ ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. మహిళలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించే విధంగా చట్టలు తీసుకొస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories