LockDown: దేశంలో పాక్షిక సడలింపులు ఇవే.. రెడ్ జోన్లలో కఠినంగా ఆంక్షలు

LockDown: దేశంలో పాక్షిక సడలింపులు ఇవే.. రెడ్ జోన్లలో కఠినంగా ఆంక్షలు
x
Representational Image
Highlights

కరోనా మహమ్మారి క‌ట్ట‌డికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం దేశ‌వ్యాప్తంగా మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించింది.

కరోనా మహమ్మారి క‌ట్ట‌డికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం దేశ‌వ్యాప్తంగా మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించింది. ఈ రోజు సోమ‌వారం నుంచి మిన‌హాయింపులు ఉంటాయ‌ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ మిన‌హాయింపులు నేటి నంచి అమల్లోకి రానున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పశుసంవర్ధక, మార్కెటింగ్‌, ఆహారశుద్ధి పరిశ్రమల కార్యకలాపాలను ఇదివ‌ర‌కే కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ఇవాళ్టి నుంచి కొత్తగా మునిసిపల్‌ పరిధి ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కార్యకలాపాలకు పచ్చజెండా ఊపింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు లేని 353 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జీవనోపాధి పనులు మొదలవుతాయి. 377 జిల్లాల్లో కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహాయించి.. ఇత‌ర ప్రాంతాల్లో ప‌నుల‌కు వెసులుబాటు క‌ల్పించింది. ఈ-కామర్స్ ఇచ్చిన వెసులుబాటును ఆదివారం రద్దు చేసింది. టీవీలు, కంప్యూటర్లు, ఫ్రిజ్‌లు, వంటివి కాకుండా అత్యవసర వస్తువుల సరఫరాకు మాత్రమే వాటికి అనుమతిచ్చింది. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆంక్షల్ని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.

వెసులుబాట్లు ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని యతాతథంగా కొనసాగించడానికి ప్రయత్నించాలని రాష్ట్ర ప్ర‌భుత్వాలను అప్రమత్తం చేసింది. అవసరమనుకుంటే మరికొన్ని ఆంక్ష‌లు రాష్ట్ర ప్రభుత్వాలు విధించుకోవచ్చు. లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత తొలిసారి పాక్షిక మినహాయింపులను అమల్లోకి కేంద్ర చాలా ప్రాధాన్య‌త ఇస్తుంది. ఇందులో ఫలితాలు బట్టి భవిష్యత్తు మ‌రిన్నిఆంక్ష‌లు స‌డ‌లిపుల‌పై నిర్ణ‌యంతీసుకోనుంది. వెసులుబాటు ఉన్న ప్రాంతాల్లో మ‌ళ్లి ఏదైనా విప‌త్క‌ర ప‌రిస్థితులు వ‌స్తే మిన‌హాయింపులు తొల‌గిస్తుంది.

భారీ పరిశ్రమలు, పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక కార్మికులకు వసతి సౌకర్యాలు కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్దేశించింది. వ్యవసాయ, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల... ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు సాధ్యమైనన్ని .. ఎక్కువ పనులు కల్పించడానికి జిల్లా కలెక్టర్లు చొరవ చూపాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదేశించారు. లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న‌ప్పుడు రాష్ట్రం దాటి వెళ్లడానికి మాత్రం వీల్లేదని హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా స్పష్టం చేశారు.

కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారం కొవిడ్‌ కేసులు అధిక సంఖ్యలో ప్రాంతాలు, నాలుగు రోజుల్లోపు కేసులు రెట్టింపు అవుతున్న ప్రాంతాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించాల్సి ఉంటుంది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించ‌డానికి కంటెయిన్‌మెంట్‌ జోన్లు, బఫర్‌ జోన్లు ఏర్పాటుచేయాలి. ఈ కంటెయిన్‌మెంట్‌ జోన్లలో ఎలాంటి మినహాయింపులూ వర్తించవు. ఎలాంటి రాకపోకలు అనుమతించకూడదు. విద్యాసంస్థలు, వాటి అనుబంధ కార్యక్రమాలు, సినిమా థియేట‌ర్లు, వాణిజ్య సముదాయాలు, పార్కులు, అన్నిరకాల సామాజిక, మత, రాజకీయ, క్రీడా, వినోద కార్యక్రమాలూ మే 3 వరకూ అనుమ‌తి లేదు. టాక్సీలు, ఆటోలు, సైకిల్‌ రిక్షాలు, క్యాబ్‌లు నడవడానికి వీల్లేదు.

నేటి నుంచి అమల్లోకి వచ్చే కార్యకలాపాలు

నిర్మాణ స్థలంలో కార్మికులు అందుబాటులో ఉంటే పట్టణ ప్రాంతాల్లో ఆగిపోయిన నిర్మాణ పనుల కొనసాగింపు (బయటినుంచి కార్మికుల్ని తీసుకురాకూడదు)

♦ వైద్యపరమైన, పశువైద్యపరమైన, అత్యవసర వస్తువుల సేకరణ లాంటి సేవల కోసం ప్రైవేటు వాహనాలకు అనుమతి

♦ జాతీయ రహదారుల వెంబడి దాబాలు (ప్యాకింగ్‌లో ఉన్న ఆహారాన్నే విక్రయించాలి)

♦ ట్రక్కుల మరమ్మతు దుకాణాలు

♦ ఎలక్ట్రీషియన్‌, ఐటీ రిపేర్లు, ప్లంబర్లు, మోటారు మెకానిక్‌లు, కార్పెంటర్‌ వంటి స్వయం ఉపాధి సేవలు

♦ పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల బయట గ్రామీణ ప్రాంతాల్లో నడిచే పరిశ్రమలు

♦ ఐటీ హార్డ్‌వేర్‌ తయారీ కేంద్రాలు

♦ షిఫ్టులవారీ పని విధానంలో, భౌతికదూర నిబంధనలతో జూట్‌ పరిశ్రమలు

♦ గ్రామీణ ప్రాంతాల్లో ఇటుక బట్టీలు

♦ గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, భవనాలు, అన్నిరకాల పారిశ్రామిక ప్రాజెక్టులు, ఎంఎస్‌ఎంఈ కార్యకలాపాలు. పారిశ్రామిక క్షేత్రాల్లోని అన్ని రకాల ప్రాజెక్టులు

♦ పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల నిర్మాణం

♦ ప్రభుత్వ కాల్‌సెంటర్లు

♦ వ్యవసాయంలో వినియోగించే యంత్రసామగ్రి, విడిభాగాలు విక్రయించే దుకాణాలు

♦ ఔషధాలు, వైద్య పరికరాలు తయారు చేసే యూనిట్లు

♦ ఆయుష్‌తో సహా అన్ని రకాల వైద్య సేవలు

♦ అన్ని రకాల సరకు రవాణా వాహనాలు

♦ గ్రామీణ ఉపాధి హామీ పనులు

♦ ఐటీ, ఐటీ ఆధారిత సేవలు (50% సిబ్బందితో)

♦ గ్రామ పంచాయతీల స్థాయిలో ప్రభుత్వ ఆమోదం ఉన్న కామన్‌ సర్వీస్‌ సెంటర్లు

♦ కొరియర్‌ సేవలు

♦ లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు సోమవారం నుంచి పనిచేయనున్నాయి.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి హాట్‌స్పాట్ గా లేని గ్రామీణ ప్రాంతాల్లో పనులు ప్రారంభించుకుంటున్న తరుణంలో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సూచించింది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న కాలంలో పనులు ప్రారంభమైనప్పటికీ ఎక్కడా మద్యం, గుట్కా, పొగాకు విక్రయాలు జరపకూడదని పేర్కొంది.

♦ బహిరంగ స్థలాలు, పనిచేసే చోట్ల ముఖానికి మాస్క్‌ తప్పనిసరి. భౌతిక దూరాన్ని అమలు చేయాలి.

♦ సంస్థలు కానీ, బహిరంగ స్థలాల నిర్వాహకులు కానీ, ఎక్కడా 5 మంది, అంతకంటే ఎక్కువ గుమికూడదు.

♦ వివాహాలు, అంత్యక్రియల్లో ఎక్కువమంది అనుమ‌తిచ్చ‌కుండా కలెక్టర్లు నియంత్రించాలి.

♦ ఒక్కరికి విధిగా థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి. వీలైనన్ని చోట్ల శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.

♦ ప్రతి షిఫ్ట్‌ మధ్య ఒక గంట తేడా పాటించాలి. ఒక షిఫ్ట్‌ నడుస్తుండగానే ఇంకో షిఫ్ట్‌ ప్రారంభంకాకూడదు. భోజనాలకు, క్యాంటీన్లకు ఉద్యోగులు దశలవారీగా వెళ్లేలా చూడాలి.

♦ పరిశ్రమ ప్రాంగణంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని, యంత్రాలనూ ఇన్‌ఫెక్షన్‌ లేకుండా శుభ్రం చేయాలి.

♦ ఎక్కువమంది గుమికూడరాదు. మీటింగ్‌ల్లో, శిక్షణా కార్యక్రమాల్లో ప్రతి కుర్చీకి మధ్య ఆరు అడుగుల దూరం ఉంచాలి.

♦ ఉద్యోగులందరికీ వైద్య బీమా తప్పనిసరి.

♦ లిఫ్ట్‌లో ఇద్దరికి మించి అనుమతివ్వకూడదు. సాధ్యమైనంత మేర మెట్ల ద్వారా రాకపోకలు సాగించడాన్ని ప్రోత్సహించాలి.

♦ ఫ్యాక్టరీల ప్రాంగణాల్లో గుట్కా, పొగాకు వినియోగాన్ని నిషేధించాలి.

♦ అనారోగ్య సమస్యలున్న 65 ఏళ్లకు పైబడిన వయోవృద్ధులు, అయిదేళ్లలోపు వయసుగల పిల్లలున్న తల్లిదండ్రులను ఇంటినుంచే పని చేసేలా ప్రోత్సహించాలి.

♦ పారిశ్రామిక ప్రాంగణంలోని అన్ని ప్రాంతాలనూ క్రిమిరహితంగా శుభ్రపరచాలి. వాష్‌రూమ్‌లు, టాయిలెట్లు, నీటి కొళాయిలు, అన్నిరకాల గోడలు, ఉపరితలాలను శుభ్రం (డిస్‌ఇన్‌ఫెక్ట్‌) చేయాలి.

♦ అన్ని ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, ఉమ్మడి ప్రాంతాల్లో తాకకుండానే చేతులు శుభ్రం చేసుకొనే పరికరాలను అందుబాటులో ఉంచాలి.

♦ బయటినుంచి వచ్చే కార్మికులకు యజమానులే రవాణా సౌకర్యం కల్పించాలి. ఈ వాహనాలు కేవలం 30-40% సామర్థ్యంతోనే నడవాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories