మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ పొడిగించిన పంజాబ్‌

మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ పొడిగించిన పంజాబ్‌
x
Representational Image
Highlights

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే నెల 3వ తేదీ వరకు కేంద్రం లాక్‌డౌన్‌ విధించింది.

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే నెల 3వ తేదీ వరకు కేంద్రం లాక్‌డౌన్‌ విధించింది. అయితే పంజాబ్‌లో మే 3వ తేదీ నుంచి మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా వైరస్‌ను పూర్తిగా కట్టడిచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ బుధవారం వెల్లడించారు.

ఈ మేరకు సీఎం వీడియో సందేశంలో మాట్లాడుతూ.. కర్ఫ్యూ నేపథ్యంలో ప్రతిరోజూ కేవలం నాలుగు గంటలపాటు మాత్రమే సడలింపు ఉంటుందని తెలిపారు. రోజూ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచేందుకు రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల విభాగం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్లు, మాస్కులను కచ్చితంగా వాడాలని పేర్కొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories