పోలీసు వాహనాలపై రాళ్లు రువ్విన వలస కార్మికులు

పోలీసు వాహనాలపై రాళ్లు రువ్విన వలస కార్మికులు
x
Highlights

లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు చెందుతున్నారన్న సంగతి తెలిసిందే.

లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు చెందుతున్నారన్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులకు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయినా కొన్నిచోట్ల ఇబ్బందులు తప్పడం లేదు. గుజరాత్ రాష్ట్రం సూరత్ జిల్లాలోని మోరా గ్రామంలో శనివారం తమ సొంత రాష్ట్రాలకు పంపాలని డిమాండ్ చేస్తూ, వందలాది మంది వలస కార్మికులు పోలీసులతో గొడవ పడ్డారని ఒక అధికారి తెలిపారు.

దీంతో పారిశ్రామిక పట్టణం హజీరా సమీపంలోని మోరా గ్రామంలో వందలాది మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు, వారిలో కొంతమంది సహనం కోల్పోయి పోలీసులతో ఘర్షణ పడ్డారు.. పోలీసు వాహనాలపై రాళ్ళు రువ్వారు. నిరసన కార్మికులు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశాలోని తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్మికుల్లో ఎక్కువ మంది హజీరాలోని పారిశ్రామిక యూనిట్లలో పనిచేస్తూ మోరా గ్రామంలో నివసించేవారని, ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారని, అక్కడ భద్రతను కఠినతరం చేశారని అధికారి తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories