
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపు కారణంగా వలస కూలీలు రైళ్లలో వారి స్వస్థలాలకు వెళుతుండవచ్చు, కాని కాలినడకన , సైకిళ్ళలో వెళ్ళే వందలాది మంది కార్మికులు...
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపు కారణంగా వలస కూలీలు రైళ్లలో వారి స్వస్థలాలకు వెళుతుండవచ్చు, కాని కాలినడకన , సైకిళ్ళలో వెళ్ళే వందలాది మంది కార్మికులు ఇంకా ఉన్నారు. పంజాబ్ నుండి హర్యానాలోని అంబాలా సరిహద్దుకు వందలాది మంది వలస కూలీలు వస్తున్నారు, అందులో కొంతమంది కనీసం చెప్పులు లేకుండా నడుస్తున్నారు. అయితే ఇంతా చేసినా వారు పోలీసులతో పోరాటం చేస్తున్నారు. వలస తరమడానికి పోలీసులు కూడా లాఠీ ఛార్జ్ చేయవలసి వస్తుంది. ప్రతిరోజూ ఇలా వందలాది మంది వలసదారులు లూధియానా నుండి వస్తున్నారు.
పోలీసులు వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. వలసకూలీలు వినకపోతే వారిపై లాఠీచార్జి చేస్తున్నారు. దీనిపై హర్యానా హోం, ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ.. పంజాబ్ ప్రభుత్వం వారికి అవసాయమైన ఏర్పాటు చేసి ఉండాలి. ఏ ఏర్పాట్లు చెయ్యకుండా వలస కూలీలను హర్యానాలోకి ఇలా నెట్టడం సరికాదన్నారు. వారికి అవసరమైన ఏర్పాట్లు ,ఆశ్రయం కల్పించాలని అధికార యంత్రాంగాన్ని ఆయన కోరారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



