Uttar Pradesh: లాక్ డౌన్ ఉల్లంఘన.. బీజేపీ నాయకుడు సహా 20 మందిపై కేసు నమోదు

Uttar Pradesh: లాక్ డౌన్ ఉల్లంఘన.. బీజేపీ నాయకుడు సహా 20 మందిపై కేసు నమోదు
x
Highlights

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే కొందరు యువకులు.. దొరికిందే సందు అనుకోని క్రికెట్ ఆడుతున్నారు.

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే కొందరు యువకులు.. దొరికిందే సందు అనుకోని క్రికెట్ ఆడుతున్నారు. పల్లెల్లో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ద్వారా కరోనావైరస్ లాక్‌డౌన్ ఉల్లంఘించినందుకు స్థానిక బిజెపి నాయకుడితో సహా 20 మందిపై గురువారం కేసు నమోదైంది.

టికైట్ నగర్ ప్రాంతంలోని పనాపూర్ గ్రామానికి చెందిన కొందరు యువకులు లాక్డౌన్ కారణంగా ఖాళీగా ఉన్నారు. ఇలా ఉన్నవారు ఉండకుండా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు వారందరిపై కేసు నమోదు చేశారు. ఇందులో స్థానిక బీజేపీ నాయకుడు కూడా ఉన్నారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో 20 మందికి పైగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారని.. పోలీసులు గ్రామానికి చేరుకుని వారిని అరెస్ట్ చేసినట్టు జిల్లా బారాబంకీ ఎస్పీ అరవింద్ చతుర్వేది తెలిపారు.

స్థానిక బిజెపి నాయకుడు సుధీర్ సింగ్, అతని కుటుంబ సభ్యులు , అలాగే గ్రామానికి చెందిన మరికొందరు వ్యక్తులపై 269 సెక్షన్ , అంటువ్యాధి చట్టం 188 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య 1475 కు చేరుకుంది. అదే సమయంలో 11 జిల్లాలను కరోనా రహిత జిల్లాలుగా ప్రకటించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories