లాక్‌డౌన్‌ 5.0 జూన్‌ 30 వరకూ.. సడలింపులు ఇవే

లాక్‌డౌన్‌ 5.0 జూన్‌ 30 వరకూ.. సడలింపులు ఇవే
x
Highlights

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, లాక్‌డౌన్‌ 5.0లో...

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, లాక్‌డౌన్‌ 5.0లో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.

* కర్ఫ్యూ రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకూ ..

* జూన్‌ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలకు అనుమతి.

* జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్‌ మాల్స్‌కు అనుమతి.

* విద్యాసంస్థలు పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం

* విద్యాసంస్థల పునఃప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఇవ్వనుంది.

* పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి అధికారం

* మెట్రో రైలు సేవలకు ఇంకా అనుమతి లేదు

* సినిమాహాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, పార్కులు, బార్లకు, రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి అనుమతి లేదు

* అంతర్జాతీయ విమాన సేవలకు అనుమతి లేదు

*అంతర్రాష్ట్ర రవాణాపై కేంద్ర హోంశాఖ నిషేధం ఎత్తివేత

*రవాణా అనుమతించే విషయం రాష్ట్రాలదే నిర్ణయం

* తెలుగు రాష్ట్రాల రవాణాకు ఆయా ప్రభుత్వాలదే నిర్ణయం

Show Full Article
Print Article
Next Story
More Stories