ఇవాళ్టితో ముగియనున్న లాక్ డౌన్ 3.0.. రేపటి నుంచి 4.0.. మినహాయింపులు ఇవేనా?

ఇవాళ్టితో ముగియనున్న లాక్ డౌన్ 3.0.. రేపటి నుంచి 4.0.. మినహాయింపులు ఇవేనా?
x
Highlights

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మూడోదశ ఇవాళ్టితో ముగియనుంది. సోమవారం నుంచి లాక్‌డౌన్‌ 4.0 ప్రారంభం కానుంది.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మూడోదశ ఇవాళ్టితో ముగియనుంది. సోమవారం నుంచి లాక్‌డౌన్‌ 4.0 ప్రారంభం కానుంది. ఈ విషయాన్నీ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన విషయంలో తెలిసిందే. కాగా.. లాక్ డౌన్ 4.0 ఎన్ని రోజులు ఉంటుంది.? నిబంధనలు ఎలాంటి మినహాయింపులు ఉంటాయి.? అనే వివరాలకు సంబంధించి ప్రకటన ఇవాళ వెలువడుతుంది. కాగా, జూన్ 2 వరకు నాలుగో దశ లాక్ డౌన్ కొనసాగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి మరిన్ని సడలింపులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందని సమాచారం.

కోవిడ్ 19 తీవ్రత ఎక్కువగా ఉన్న 30 మునిసిపల్ ఏరియాలనూ కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయనున్నారు. కోల్‌కతా, జైపూర్, నాసిక్, జోధ్పూర్, ఆగ్రా, తిరువల్లూరు, ఔరంగాబాద్, కడలూరు, గ్రేటర్ హైదరాబాద్, సూరత్,

గ్రేటర్ ముంబై, గ్రేటర్ చెన్నై, అహ్మదాబాద్, థానే, ఢిల్లీ, ఇండోర్, పూణే, చెంగల్‌పట్టు, కర్నూలు, భోపాల్, అమృత్‌సర్‌, విల్లుపురం, వడోదర, ఉదయపూర్, పాల్ఘర్, బెర్హంపూర్, సోలాపూర్, మీరట్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.

కంటైన్మెంట్ జోన్లలో ప్రజలు తమ ఇళ్లలోనే ఉండేలా CRPC క్రింద 144 సెక్షన్ అమలు చేయబడుతుంది. అయినప్పటికీ ఆ ప్రాంతాల్లో నిత్యావసరాలకు కొరత ఏర్పడకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ జారీ చేసిన నూతన మార్గదర్శకాలు పేర్కొన్నాయి. మరోవైపు రైల్వేశాఖ జూన్ 30 వరకు టిక్కెట్లు రద్దు చేసినట్లు తెలుస్తోంది.

పాఠశాలలు, థియేటర్లు, మాల్స్, జిమ్‌లు మినహా అనుమతి ఉండకపోవచ్చు..

గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని కార్యకలాపాలకు అనుమతించే అవకాశం ఉంది.

కంటైన్మెంట్ జోన్లు మినహాయించి ప్రజా రవాణా పరిమితంగా ప్రారంభమయ్యే అవకాశం

కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ పార్లర్, సెలూన్లు తెరుచుకోనున్నాయి.

దేశీయ విమాన సర్వీసుకు ప్రారంభం అయ్యే అవకాశం

Show Full Article
Print Article
More On
Next Story
More Stories