Thunderstorms: బీహార్ లో పిడుగుల బీభత్సం.. 13 మంది దుర్మరణం

Thunderstorms
x

Thunderstorms

Highlights

Thunderstorms: బీహార్ లో అకాల వర్షాలు బీభత్సం స్రుష్టించాయి. పలు జిల్లాల్లో ఈదరు గాలులు, వడగళ్ల వాన కురిసింది. బుధవారం ఉదయం రాష్ట్రంలోని నాలుగు...

Thunderstorms: బీహార్ లో అకాల వర్షాలు బీభత్సం స్రుష్టించాయి. పలు జిల్లాల్లో ఈదరు గాలులు, వడగళ్ల వాన కురిసింది. బుధవారం ఉదయం రాష్ట్రంలోని నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది మరణించారు. బెగూసరాయ్, దర్ బంగా జిల్లాల్లో వెర్వేరు ఘటనల్లో 9 మంది మరణించారు. మధుబనీలో ముగ్గురు మరణించారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె ఉన్నారు. సమస్తిపూర్ లో ఓ వ్యక్తి పిడుగుపాటు వల్ల మరణించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు సీఎం నితీశ్ కుమార్. బాధిత కుటుంబాలకు రూ. 4లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసే సూచనల ప్రకారం నడుచుకోవాలని ప్రజలకు విజ్నప్తి చేశారు. ఇదెలా ఉంటే బీహార్ ఆర్థిక సర్వే ప్రకారం 2023లో పిడుగుపాటు కారణంగా రాష్ట్రంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories