Jayalalitha Leaked Audio: జయలలిత మరణానికి ముందు ఏం జరిగింది..?

Jayalalitha Leaked Audio: బెడ్‌పై ఉండగా డాక్టర్లపై అసహనం వ్యక్తం చేసిన జయలలిత

Rama Rao
Published on: 20 Oct 2022 5:48 PM IST
Leaked Audio Said to be of Jayalalithaa goes Viral After Arumughaswamys Report gets Tabled in TN Assembly
X

తీవ్ర సంచలనంగా మారిన జయలలిత ఆడియో క్లిప్

Jayalalitha Leaked Audio: జయలలిత మృతిచెంది ఏడేళ్లు కావస్తున్నా.. ఆమె మరణంపై వెనుకున్న రహస్యాలు ఇంకా వీడటం లేదు. ఆమె మరణంపై ఏర్పాటు చేసిన అర్ముగస్వామి ఇచ్చిన రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. కమిటీ రిపోర్ట్‌ను స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టడంతో మరోసారి ఈ వ్యవహారంలో రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె అనారోగ్యంగా ఉన్న సమయంలో నెచ్చెలి శశికళ వ్యవహరించిన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ మరణానికి ముందు జయలలిత చేసిన వ్యాఖ్యల ఆడియో క్లిప్ తీవ్ర సంచలనంగా మారింది.

2015లో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జయలలిత బెడ్ పై ఉన్నప్పుడు మాట్లాడినట్లు తెలుస్తోంది. తాను పిలిచినపుడు మీరెందుకు రాలేదంటూ డాక్టర్లపై జయలలిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఆడియో లో స్పష్టమవుతోంది. అదే సమయంలో ఆమె దగ్గుతూ ఆయాసపడుతున్నట్లు.. ఆడియో ద్వారా అర్థమవుతోంది. ఇంతలా బాధపడున్నా మీరు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆమె మాటలను ఆస్పత్రి సిబ్బంది రికార్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో జయలలితకు అందించిన వైద్యంపై విమర్శలు ఇప్పుడప్పుడే తగ్గేవి కాదని తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story