Omicron Cases in India: గతేడాది డెల్టా.. ఇప్పుడు ఒమిక్రాన్‌.. ఇవాళ కొత్తగా 12 కేసులు

Last Year Delta Variant Now Omicron Cases in India Increasing
x

Omicron Cases in India: గతేడాది డెల్టా.. ఇప్పుడు ఒమిక్రాన్‌.. ఇవాళ కొత్తగా 12 కేసులు 

Highlights

Omicron Cases in India: దక్షిణాఫ్రికాలో పుట్టి ప్రపంచదేశాలపై దండయాత్ర...

Omicron Cases in India: రావడం కాస్త లేట్‌ కావచ్చు. కానీ రావడం మాత్రం పక్కా అన్నట్లు ఒమిక్రాన్‌ దూసుకువచ్చింది. ఏడాదికో అవతారమెత్తుతున్న కరోనా ఇప్పుడు ఒమిక్రాన్‌ రూపంలో వచ్చేసింది. వచ్చిరాగానే జనాల్లో టెన్షన్‌ పుట్టిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కరోనా వైరస్‌ ఏడాదికో అవతారమెత్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ అవతారాల్లో ఒమిక్రాన్ వెరియంట్ మాత్రం కాస్త కలవర పెడుతోంది. కొత్త వేరియంట్ బీ.1.1.529 వైరస్ అసలు రూపానికి భిన్నమైన స్వరూపం కలిగి ఉందని యూకే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో సెకండ్ వేవ్ విజృంభణకు డెల్టా వేరియంట్ కారణమైంది.

కోట్ల మంది డెల్టా వేరియంట్ బారినపడగా, వేలాది మంది మృత్యువాత పడ్డారు. దాని తరువాత వచ్చిన వేరియంట్స్ పెద్ద ప్రభావం చూపలేదు. కానీ దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్‌ ప్రపంచదేశాలపై దండయాత్ర మొదలుపెట్టింది. డెల్టా వేరియంట్ కంటే వేగంగా దూసుకువెళ్తోంది.

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. తాజాగా 12 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశంలో కేసుల సంఖ్యల 53కి చేరింది. దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండడంతో విమానరాకపోకలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పైగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలంతా తూచా తప్పకుండా కోవిడ్‌ రూల్స్ పాటించాలని ఆంధ్రా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories