Maharashtra: మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు

Landslide in Maharashtra due Heavy Rains
x

మహారాష్ట్రలో భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Maharashtra: బీభత్సం సృష్టిస్తోన్న వరదలు * కొన్ని ప్రాంతాల్లో విరిగిపడిన కొండచరియలు

Maharashtra: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మహారాష్ట్రలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. గతవారం రోజుల నుంచి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముంబై మహానగరంతో పాటు రాష్ట్రంలోని పలు నగరాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ముంబై శివారల్లోలని భివాండిలో వరద పోటెత్తింది. వందలాది ఇళ్లు నీట మునిగాయి. కార్లతో పాటు ఇతర వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. రత్నగిరిలో కుంభవృష్టి కురిసింది. కొండచరియలు విరిగిపడడంతో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దింపారు.

బోట్లతో సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వందలాది మందిని సురక్షిత ప్రాంతలకు తరలించారు. నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహించదడంతో ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు. నాసిక్‌లో కొండచరియలు విరిగిపడడంతో రైల్వే ట్రాక్‌లు ధ్వంసమయ్యయాయి. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పుణే సమీపంలో చాలా డ్యాంలు నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పశ్చిమకనుమల్లో భారీ వర్షం రికార్డులు సృష్టిస్తోంది. మహాబలేశ్వర్‌లో రికార్డు స్థాయిలో 70 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories