Corona: ఆ రాష్ట్రాల్లో 2వారాల్లో కేసులు పెరుగుతాయి..లండన్ యూనివర్సిటీ

Landon University Says Cases Are Hiking in Assam, Himachel Pradesh, Tamilnadu on Next 2 Weeks
x

Representational Image

Highlights

Corona: ఇక దేశంలో అస్సోం , హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, త్రిపుర వంటి రాష్ట్రాల్లో వచ్చే రెండు వారాల్లో భారీగా కేసులు

Corona: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే దేశంలో తొలిద‌శ క‌రోనా వ్యాప్తి కంటే రెండో ద‌శ‌లోనే అత్య‌ధిక కేసులు ఉన్న‌ట్లు లండన్ లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ అంటోంది. సెకండ్ వేవ్ పై వర్సిటీలోని జడ్జ్ బిజినెస్ స్కూల్, ద నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ రీసెర్చ్ కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు.

భారత్ లో కేసుల పెరుగుదలకు గల కారణాలపై ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు విషయాలను వెల్లడించింది. ఆ అధ్యయనంలో భాగంగా భార‌త్ లో క‌రోనా కేసులు పతాక స్థాయికి చేరిందని, మెల్లమెల్లగా కేసుల్లో క్షీణత కనిపిస్తోందని పేర్కొన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కేసులు తగ్గుతున్నా.మ‌రి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పెరుగుతున్నాయని స్ప‌ష్టం చేసింది.

కరోనా వేరియంట్లు పెరగడం, కొన్ని మత కార్యక్రమాలు జరగడం,ఎన్నిక‌ల‌ వంటి వాటి వల్ల కొవిడ్ వ్యాప్తి బాగా పెరిగిపోయింది. వేరియంట్లూ ఎక్కువయ్యాయి. ప్రజారోగ్యం, సామాజిక చర్యల్లో లోపాల వల్ల కేసులు మరింత ఎక్కువయ్యాయి'' అని పరిశోధకులు పేర్కొన్నారు. ఇక దేశంలో అస్సోం , హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, త్రిపుర వంటి రాష్ట్రాల్లో వచ్చే రెండు వారాల్లో కేసులు భారీగా పెరుగుతాయని హెచ్చరించారు. రోజువారీ నమోదవుతున్న కేసులు, నిపుణుల నివేదికల ఆధారంగా పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories