కోల్‌కతా డాక్టర్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ గురించి తల్లి మాలతీ రాయ్ ఏమన్నారంటే...

కోల్‌కతా డాక్టర్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ గురించి తల్లి మాలతీ రాయ్ ఏమన్నారంటే...
x
Highlights

RG Kar Medical College doctor rape and murder: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ తల్లి స్పందన

RG Kar Medical College doctor rape and murder case: కోల్‌కతా ఆర్. జీ. కార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ ని రేప్ చేసి, మర్డర్ చేసిన కేసులో A1గా ఉన్న సంజయ్ రాయ్ ను కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. కోర్టు రేపు జనవరి 20న సంజయ్ రాయ్ కు శిక్ష విధించనుంది.

తాజాగా కోర్టు తీర్పు పై అతడి తల్లి మాలతీ రాయ్ స్పందించారు. తనకు కూడా ముగ్గురు కూతుళ్లు ఉన్నారని చెబుతూ ''ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో తను అర్థం చేసుకోగలను '' అని అన్నారు.

సంజయ్ రాయ్ ను కోర్టు దోషిగా తేల్చింది కనుక తన కొడుక్కు ఏం శిక్ష పడుతుందో కోర్టు ఆ శిక్ష విధించాల్సిందేనన్నారు. "ఒకవేళ కోర్టు తన కొడుకుకు ఉరి శిక్ష వేసినా తను ఆ తీర్పును అంగీకరిస్తాను" అని మాలతీ రాయ్ చెప్పారు.

సంజయ్ రాయ్ ఈ కేసులో కోర్టు విచారణ ఎదుర్కొంటున్న సమయంలోనూ అతడి తల్లి కానీ లేదా అక్కాచెల్లెళ్ళు కానీ అతడిని చూడ్డానికి కూడా వెళ్ళలేదు.

సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చిన సెల్డా కోర్టు శంబునాథ్ పండిట్ వీధిలో మాలతీ రాయ్ కుటుంబం ఉంటున్న ఇంటికి కేవలం 6 కిమీ దూరం. అయినప్పటికీ ఆమె ఆ తీర్పును వినేందుకు అక్కడికి వెళ్లలేదు.

సంజయ్ రాయ్ వ్యక్తిత్వం పట్ల, అతడి నేర ప్రవృత్తి పట్ల ఆ కుటుంబం ఎంతగా విసిగిపోయి ఉందో అక్కడే అర్థం అవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories