Kishan Reddy: కుంభమేళాలో కిషన్ రెడ్డి ఫ్యామిలీ..

Kishan Reddy: కుంభమేళాలో కిషన్ రెడ్డి ఫ్యామిలీ..
x
Highlights

Kishan Reddy: చాలా మంది ప్రముఖులవలే కేంద్ర మంత్రికిషన్ రెడ్డి కూడా కుంభమేళాకు వెళ్లారు. కుటుంబ సమేతంగా ఆచారాలు పాటించారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే...

Kishan Reddy: చాలా మంది ప్రముఖులవలే కేంద్ర మంత్రికిషన్ రెడ్డి కూడా కుంభమేళాకు వెళ్లారు. కుటుంబ సమేతంగా ఆచారాలు పాటించారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా కావడంతో దేశ విదేశాల నుంచి ప్రముఖులు, సినీతారలు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ప్రయాగ్ రాజ్ వచ్చి మహాకుంభమేళాలో పాల్గొంటున్నారు. తాను కుటుంబ సమేతంగా త్రివేణి సంగమానికి వచ్చి పుణ్యస్నానం చేశానని కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.


పరమ పవిత్రమైన కుంభమేళాలో స్నానం చేయడం సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని మంత్రి తెలిపారు. ప్రయాగ్ రాజ్ లో కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడాన్ని చూస్తే సనాతన ధర్మం, మన సంస్క్రుతి, సంప్రదాయాలపై రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణకు ఇదో సజీవమైన ఉదాహరణ అన్నారు. ఈ సందర్బంగా దేశ ప్రజలందరికీ సుఖశాంతులు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories