దేశంలోనే అరుదైన ఘటన.. కుక్కకు పేస్‌మేకర్‌

దేశంలోనే అరుదైన ఘటన.. కుక్కకు పేస్‌మేకర్‌
x
Highlights

తొలిసారి ఓ కుక్కకు పేస్‌మేకర్‌ విజయవంతంగా అమర్చారు. ఏడున్నర సంవత్సరాల కాకర్ స్పానియల్ జాతి కుక్క ఈ పేస్ మేకర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స చేయించుకుంది.

తొలిసారి ఓ కుక్కకు పేస్‌మేకర్‌ విజయవంతంగా అమర్చారు. ఏడున్నర సంవత్సరాల కాకర్ స్పానియల్ జాతి కుక్క ఈ పేస్ మేకర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స చేయించుకుంది. దిగుమతి చేసుకున్న పీడియాట్రిక్ పేస్‌మేకర్‌ను దీనికి అమర్చారు, సర్జరీ అనంతరం దీనికి ఖుషి అనే పేరు కూడా పెట్టారు. ఈ పరిణామం భారతదేశంలో మొట్టమొదటిదని వెట్(వెటర్నరీ వైద్యులు) సర్జన్లు పేర్కొన్నారు.

గతేడాది డిసెంబర్‌ 15న దాదాపు గంటన్నర పాటు ఈ ఆపరేషన్‌ జరిగినట్లు తెలిపారు. ఆపరేషన్‌కు ముందు కుక్క గుండె వేగం నిమిషానికి 20కి పడిపోయిందని, కుక్కల సాధారణ గుండె వేగం నిమిషానికి 60–120 సార్లు ఉంటుందని గ్రేటర్ కైలాష్ లోని మాక్స్ వెట్స్ హాస్పిటల్ లో చిన్న జంతువుల ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భాను దేవ్ శర్మ చెప్పారు.

గత ఏడాది ఫిబ్రవరిలో కుక్క చెవికి గాయమైందని.. తీవ్ర రక్త స్రావం జరగడంతో.. అత్యవసర చెవి ఆపరేషన్ చేశామని.. ఆ సమయంలో అది కుప్పకూలిపోయింది, కాని సర్జరీల ద్వారా కుక్క మళ్ళీ స్పృహ లోకి వచ్చింది. ఆ సమయంలో దానికి చాలా తీవ్రమైన సమస్య ఉందని గ్రహించామని డాక్టర్ శర్మ తెలిపారు.

దాని చెవికి శస్త్రచికిత్స అనంతరం వైద్యులు మరోసారి పరిశీలించారు.. దాంతో ధమనులు బ్లోక్ అయినట్టు కనుగొన్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 15 న ఆపరేషన్ చేసి పేస్‌మేకర్‌ అమర్చినట్టు తెలిపారు. దాంతో ఈ శస్త్రచికిత్సకు ముందు చాలా అలసటతో ప్రాణములేనిదిగా ఉన్న ఖుషీ చికిత్స అనంతరం సాధారణ చురుకైన స్వభావానికి తిరిగి వచ్చిందని దాని యజమాని అయిన గుర్గావ్ నివాసి మను వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories