Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో కీలక అనుమానితుడు అరెస్ట్

Key Suspect Arrested In Rameswaram Cafe Blast Case
x

Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో కీలక అనుమానితుడు అరెస్ట్

Highlights

Rameshwaram Cafe: రహస్య ప్రాంతంలో షబ్బీర్‌ను విచారిస్తున్న ఎన్ఐఏ అధికారులు

Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో కీలక వ్యక్తిని NIA అరెస్టు చేసింది. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడిని షబ్బీర్‌గా గుర్తించారు. ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ అరెస్టుపై NIA అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఇతను సహకరించినట్లు సమాచారం. ఈ నెల ఒకటో తేదీన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలిన ఘటనలో 9 మంది గాయపడ్డారు. ఈ కేసును కర్ణాటక హోంశాఖ NIAకు అప్పగించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి చిత్రాలను విడుదల చేశారు. అతని ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల రివార్డును సైతం NIA ప్రకటించింది. ఈ కేసులో నిందితుడు RDX ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories