రూ. 70 వేల కారుకు రూ. 1.11 లక్షల ఫైన్! 'మంటలు' చిమ్మిన విద్యార్థికి బెంగళూరు పోలీసుల చుక్కలు


రూ. 70 వేల కారుకు రూ. 1.11 లక్షల ఫైన్! 'మంటలు' చిమ్మిన విద్యార్థికి బెంగళూరు పోలీసుల చుక్కలు
కేరళ విద్యార్థికి బెంగళూరు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. రూ. 70 వేల పాత కారును మోడిఫై చేసి, ఎగ్జాస్ట్ నుంచి మంటలు వచ్చేలా విన్యాసాలు చేసినందుకు ఏకంగా రూ. 1.11 లక్షల జరిమానా విధించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే పిచ్చితో కొందరు చేసే పనులు భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన ఒక ఇంజినీరింగ్ విద్యార్థి తన పాత కారును 'ఫైర్ స్పె్యూయింగ్' (నిప్పులు చిమ్మే) కారుగా మార్చి రోడ్లపై హల్‌చల్ చేశాడు. దీనికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కళ్లు చెదిరే రేంజ్‌లో బుద్ధి చెప్పారు.
అసలేం జరిగింది?
కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన సదరు విద్యార్థి, కొత్త సంవత్సర వేడుకల కోసం తన 2002 మోడల్ హోండా సిటీ కారులో బెంగళూరుకు వచ్చాడు. కేవలం రూ. 70,000 పెట్టి కొనుగోలు చేసిన ఆ పాత కారుకు అక్రమంగా భారీ మార్పులు (Modifications) చేశాడు.
భయంకరమైన ఎగ్జాస్ట్: కారు సైలెన్సర్‌ను మార్చేసి, ఇంజిన్ రేస్ చేసినప్పుడు పెద్ద శబ్దం రావడంతో పాటు ఎగ్జాస్ట్ పైపు నుంచి మంటలు వచ్చేలా సెట్ చేయించాడు.
లుక్ మార్పు: కారు రంగు మార్చడం, నంబర్ ప్లేట్ నిబంధనలు ఉల్లంఘించడం, బాడీపై 'బ్యాంగర్' అని గ్రాఫిటీ వేయించడం వంటివి చేశాడు.
సోషల్ మీడియా రీల్స్‌తో దొరికిపోయాడు!
బెంగళూరులోని హెన్నూర్ రోడ్డులో ఈ కారు నిప్పులు చిమ్ముతూ వెళ్తుండగా తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు జనవరి 2న కారును సీజ్ చేశారు.
కారు ధర కంటే జరిమానానే ఎక్కువ!
యలహంక ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) అధికారులు ఈ కేసును విచారించి, మోటారు వాహనాల చట్టం ప్రకారం గరిష్ట జరిమానా విధించారు.
♦ జరిమానా మొత్తం: రూ. 1,11,500
♦ విద్యార్థి ఈ భారీ మొత్తాన్ని చెల్లించిన తర్వాతే పోలీసులు కారును వదిలిపెట్టారు. "పబ్లిక్ రోడ్లు స్టంట్లు చేయడానికి కాదు.. మీ విన్యాసాలకు భారీ ధర చెల్లించాల్సి ఉంటుంది" అంటూ బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈ ఉదంతాన్ని ఎక్స్ (X) లో పోస్ట్ చేశారు.
Fire-Spitting Car Turns Bengaluru Roads into Circus: Reckless Youth Slapped with ₹1.11 Lakh Fine, Vehicle Seized
— Karnataka Portfolio (@karnatakaportf) January 15, 2026
In a strong message against reckless behaviour and illegal vehicle modifications, the Bengaluru Traffic Police seized a car and imposed a hefty fine of ₹1.11 lakh… pic.twitter.com/Bwp7KdNXn0

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



