గిరిజనులకు సరుకులు అందించడం కోసం అడవిలో ట్రెక్కింగ్ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే

గిరిజనులకు సరుకులు అందించడం కోసం అడవిలో ట్రెక్కింగ్ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే
x
Kerala Collector PB Nooh
Highlights

కేరళలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే అక్కడ కేసుల సంఖ్య 200 దాటింది.

కేరళలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే అక్కడ కేసుల సంఖ్య 200 దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో గిరిజనులు నిత్యావసరాలు, ఆహార పధార్ధాలకోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ లాక్డౌన్ ఆహారం మరియు పచారీ వస్తువులతో ఒంటరిగా నివసిస్తున్న గిరిజన ప్రాంతాల ప్రజలకు చేరవేర్చాలని నిర్ణయించుకున్నారు. దీంతో పఠనంథిట్ట జిల్లా కలెక్టర్, కొన్నీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి గిరిజన స్థావరానికి బియ్యం, కిరాణా సామాగ్రిని తీసుకెళ్లడానికి అడవి లోపల 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేశారు. పతనమిట్ట జిల్లాలోని అవనిప్పర గిరిజన స్థావరం మీనాచిల్ నదికి అవతలి వైపున పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం లోపల 12 కిలోమీటర్ల లోతులో ఉంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఈ ప్రాంతంలోని ముప్పై ఏడు గిరిజన కుటుంబాలు అవసరమైన సామాగ్రి కొరతతో ఉన్నాయి.

ఆ ప్రాంత వార్డు కౌన్సిలర్ సమాచారం ఇవ్వడంతో సిపిఐ (ఎమ్) ఎమ్మెల్యే కెయు జనీష్ కుమార్ మరియు స్వచ్ఛంద సేవకుల బృందం అడవిలోని కుటుంబాలకు ఆహారం మరియు ఇతర నిత్యావసరాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. సాధారణ పర్యవేక్షణలో ఉన్న కలెక్టర్ పిబి నూహ్ ఈ కార్యక్రమం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. సమీప రహదారికి కనీసం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన స్థావరాన్ని చేరుకోవడానికి ఈ బృందం కాలినడకన ఒక నదిని దాటి మొత్తం 37 కుటుంబాలకు అవసరమైన సామాగ్రిని అందించారు. అంతేకాదు జ్వరం లక్షణాలను చూపించిన పిల్లలకు అవసరమైన సహాయం అందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories